Begin typing your search above and press return to search.

రికార్డు బ్రేక్‌ చేసిన ఫ్లాప్‌ మూవీ

By:  Tupaki Desk   |   12 Nov 2020 11:00 AM IST
రికార్డు బ్రేక్‌ చేసిన ఫ్లాప్‌ మూవీ
X
బాలీవుడ్‌ దివంగత హీరో సుశాంత్‌ నటించిన చివరి సినిమా దిల్‌ బెచార హాట్‌ స్టార్‌ లో మొదటి 24 గంటల్లో రికార్డు స్థాయిలో ఏకంగా 75 మిలియన్ల వ్యూస్‌ ను దక్కించుకున్న విషయం తెల్సిందే. ఓటీటీలో అప్పటి వరకు ఉన్న రికార్డును దిల్‌ బెచారా బ్రేక్‌ చేసింది. ఇప్పట్లో దిల్‌ బెచార రికార్డును ఎవరు బ్రేక్‌ చేయలేరని భావించారు. కాని తాజాగా బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ నటించిన 'లక్ష్మి' సినిమా హాట్‌ స్టార్‌ లో రికార్డు స్థాయి వ్యూస్‌ ను దక్కించుకుంది. దేశ వ్యాప్తంగా ఈ సినిమాను అత్యధిక మంది చూసినట్లుగా తెలుస్తోంది.

దిల్‌ బెచార సినిమా హాట్‌ స్టార్ లో ఫ్రీగానే స్ట్రీమింగ్‌ చేశారు. అందుకే ఆ స్థాయిలో వ్యూస్‌ వచ్చాయి అనుకున్నారు. అయితే అక్షయ్‌ కుమార్‌ లక్ష్మి సినిమా విఐపీ వినియోగదారులకు మాత్రమే అయినా కూడా అత్యధికులు ఈ సినిమాను చూసినట్లుగా తెలుస్తోంది. అధికారికంగా నెంబర్‌ రాకున్నా కూడా లక్ష్మి సినిమాకు చేసిన పబ్లిసిటీ కారణంగా 75 లక్షలకు పైగా వ్యూస్‌ వచ్చినట్లుగా హాట్‌ స్టార్‌ వర్గాల నుండి సమాచారం అందుతోంది. ఈ సినిమా తమిళంలో వచ్చిన కాంచనకు రీమేక్‌ అనే విషయం తెల్సిందే. లారెన్స్‌ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు నెగటివ్‌ టాక్‌ వచ్చినా కూడా రికార్డు స్థాయి వ్యూస్‌ మాత్రం వచ్చాయంటున్నారు.