Begin typing your search above and press return to search.

విధేయ రాముడి థియేటర్ల పరిస్థితి ఏంటీ?

By:  Tupaki Desk   |   8 Jan 2019 5:59 AM GMT
విధేయ రాముడి థియేటర్ల పరిస్థితి ఏంటీ?
X
ఒక్క వారంలో రెండు సినిమాలు విడుదలైతేనే పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. థియేటర్ల సమస్యతో పాటు ఓపెనింగ్స్‌ పై పెద్ద ఎత్తున ప్రభావం పడుతుందని పెద్ద సినిమాలు ఒకే వారంలో విడుదల కాకుండా జాగ్రత్త పడుతూ ఉంటారు. అయితే సంక్రాంతికి పండుగ సీజన్‌ అవ్వడం వల్ల ప్రతి సారి కూడా వారం గ్యాప్‌ లోనే రెండుకు మించి సినిమాలు విడుదల అవ్వడం జరుగుతూ వస్తుంది. అయితే ఈసారి వరుసగా నాలుగు రోజుల్లో నాలుగు సినిమాలు విడుదల కాబోతున్నాయి. రేపటి నుండి మొదలు కాబోతున్న ఈ బాక్సాఫీస్‌ వార్‌ అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

సంక్రాంతికి విడుదల కాబోతున్న నాలుగు సినిమాల్లో పేట కు ఇప్పటికే థియేటర్లు లేవంటూ తెలుగు రైట్స్‌ దక్కించుకున్న అశోక్‌ గగ్గోలు పెడుతున్నాడు. ఇక ‘ఎన్టీఆర్‌ కథానాయకుడు’ చిత్రానికి కూడా ఆశించిన స్థాయిలో థియేటర్లు దొరకలేదంటూ నందమూరి వర్గాల నుండి టాక్‌ వినిపిస్తుంది. అయితే ఈ థియేటర్ల సమస్య రామ్‌ చరణ్‌ వినయ విధేయ రామకు మాత్రం లేదు. ఎందుకంటే ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌ మరియు దిల్‌రాజులు కలిసి డిస్ట్రిబ్యూట్‌ చేస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఉన్న థియేటర్లపై వీరికి మంచి పట్టు ఉంటుందని అంతా అంటారు. నైజాం ఏరియాలో తన ఎఫ్‌ 2 చిత్రానికి చాలా నెలల క్రితమే థియేటర్లు బుక్‌ చేసుకున్న దిల్‌ రాజు తాజాగా తాను డిస్ట్రిబ్యూట్‌ చేస్తున్న వినయ విధేయ రామ చిత్రం కోసం కూడా భారీగా థియేటర్లను బుక్‌ చేసి పెట్టుకున్నాడు. ఇక కృష్ణ మరియు గుంటూరులో మంచి పట్టు ఉన్న యూవీ వారు వినయ విధేయ రామను భారీ ఎత్తున విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. యూవీ నిర్మాతలు మరియు దిల్‌ రాజు కలిసి ‘వినయ విధేయ రామ’ మరియు ‘ఎఫ్‌ 2’ చిత్రాలకు కావాల్సినన్ని థియేటర్లను కేటాయించేసుకున్నట్లుగా సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. వినయ విధేయ రామకు భారీ థియేటర్లు దొరకడంతో ఓపెనింగ్స్‌ లో రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం అంటూ మెగా ఫ్యాన్స్‌ ధీమాతో ఉన్నారు.