Begin typing your search above and press return to search.

ఆయనపై చాలా నమ్మకంగా ఉంది

By:  Tupaki Desk   |   31 Jan 2019 12:16 PM IST
ఆయనపై చాలా నమ్మకంగా ఉంది
X
బాలీవుడ్‌ ను షేక్‌ చేసిన మీటూ ఉద్యమం ఎన్నో సినిమాలపై ప్రభావం చూపిందనే విషయం తెల్సిందే. బాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ రాజ్‌ కుమార్‌ హిరానీపై లైంగిక వేదింపుల ఆరోపణలు రావడం సంచలనం అయ్యింది. ఎన్నో గొప్ప సినిమాలు తీసి సమాజంలో మార్పుకు ప్రయత్నించిన హిరానీ ఇలాంటి వాడా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేయగా, మరికొందరు మాత్రం ఆయన అలాంటి వాడు కాదని బల్ల గుద్ది మరీ చెబుతున్నారు. సంజు చిత్రం ప్రారంభంకు కొన్ని రోజుల ముందు తాను రాజ్‌ కుమార్‌ హిరానీ ద్వారా లైంగిక వేదింపులు ఎదుర్కొన్నట్లుగా ఒక మహిళ ఆరోపణలు చేసింది.

ఆ మహిళ ఆరోపణల నేపథ్యంలో పెద్ద ఎత్తున రాజ్‌ కుమార్‌ హిరానీ గురించి చర్చ జరిగింది. బాలీవుడ్‌ కు చెందిన పలువురు, ఆయనతో వర్క్‌ చేసిన స్టార్స్‌ అంతా కూడా ఆయనకు మద్దతుగా మాట్లాడారు. రాజ్‌ కుమార్‌ సహా నిర్మాతగా వ్యవహరిస్తు ప్రారంభం అయిన 'ఏక్‌ లడ్కీ కో దేఖా తో ఐసా లగా' అనే చిత్రం నుండి ఆయన్ను తప్పించారు. ఆ చిత్రంలో హీరోయిన్‌ గా నటించిన సోనమ్‌ కపూర్‌ తాజాగా దర్శకుడు రాజ్‌ కుమార్‌ హిరానీ ఎదుర్కొంటున్న లైంగిక వేదింపుల గురించి స్పందించింది.

మీటూ ఉద్యమంలో మహిళలను నేను నమ్మాను. వారు చేసిన ఆరోపణల్లో నిజం ఉందని భావించాను. కాని హిరానీ విషయంలో మాత్రం ఆ వ్యాఖ్యలను నమ్మడం లేదు. ఒక గొప్ప దర్శకుడు, ఒక గొప్ప వ్యక్తిగా ఆయన నాకు చాలా కాలంగా తెలుసు. ఆయన వంటి వ్యక్తులపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు. ఒక వేళ ఆమె చేసిన లైంగిక వేదింపుల ఆరోపణలు నిజం కాదని తెలిస్తే మాత్రం మీటూ ఉద్యమం దారి తప్పిందని అంతా భావిస్తారని సోనమ్‌ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తనపై వ్యాఖ్యలు చేసిన మహిళపై చట్టపరంగా చర్యలకు హిరానీ ప్రయత్నాలు చేస్తున్నాడు.