Begin typing your search above and press return to search.

ఇక అజ్ఞాతవాసిని మర్చిపోవచ్చు

By:  Tupaki Desk   |   25 Jan 2018 5:14 AM GMT
ఇక అజ్ఞాతవాసిని మర్చిపోవచ్చు
X
ఈ ఏడాది అదిరిపోయే బ్లాక్ బస్టర్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తాడని మెగా ఫ్యాన్స్.. పర్సనల్ గా పవన్ వీరాభిమానులు అజ్ఞాతవాసిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తీరా సినిమా విడుదలయ్యాక అభిమానులకు నీరసంలో మునిగిపోయారు. కలెక్షన్లలో కొత్త రికార్డులు వస్తాయని అభిమానులు నమ్మితే నష్టాల్లోనే అది పెద్ద రికార్డు దక్కించుకుంది. దీనికితోడు ఇక సినిమాలంటే గడిచిపోయిన కథ అనే డైలాగుతో పవన్ ఫ్యాన్స్ పూర్తిగా డీలా పడిపోయారు.

అన్ని విధాలుగా నిరాశలో కూరుకుపోయిన అభిమానులకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ సింగిల్ మినిట్ ట్రయిలర్ లోనే ఎక్కడలేని జోష్ నిచ్చాడు. రంగస్థలం ట్రయిలర్ లో చిట్టిబాబు పాత్రలో రామ్ చరణ్ ను చూసి వారిలో ఇప్పుడు కొత్త ఉత్సాహం ఉప్పొంగుకొస్తోంది. అప్పియరెన్స్ నుంచి మొదలెట్టి బాడీ లాంగ్వేజ్.. యాక్షన్ అన్నీ రంగస్థలంలో చాలా కొత్తగా ఉండటం ఫ్యాన్సును ఖుషీ చేసింది. అందుకే రిలీజైన గంటల్లోనే ఐదు మిలియన్ల హిట్లతో యూట్యూట్ లో టాప్ ట్రెండింగ్ లోకి వెళ్లిపోయింది. ఈ ట్రయిలర్ చూశాక చాలామంది పవన్ అభిమానుల నోట పలికిన మాట.. హమ్మయ్య! ఇక అజ్ఞాతవాసిని మరిచిపోవచ్చు అనేది.

రంగస్థలం ట్రయిలర్ కు వస్తున్న మిగిలిన హీరోల ఫ్యాన్స్ నుంచి వస్తున్న పాజిటివ్ కామెంట్లు కూడా మెగాభిమానులకు మరింత ఉత్సాహాన్ని ఇస్తున్నాయి. అజ్ఞాతవాసి సాధించలేని బ్లాక్ బస్టర్ ను రంగస్థలం చిట్టిబాబు సాధిస్తాడని ఆశిస్తున్నారు.