Begin typing your search above and press return to search.

'కొబ్బరిమట్ట'లో ఇంకెన్ని పంచ్‌ లు ఉన్నాయో?

By:  Tupaki Desk   |   9 Aug 2019 5:41 AM GMT
కొబ్బరిమట్టలో ఇంకెన్ని పంచ్‌ లు ఉన్నాయో?
X
'హృదయకాలేయం' చిత్రం విడుదలై దాదాపుగా నాలుగేళ్లు అయ్యింది. అప్పటి నుండి కూడా 'కొబ్బరిమట్ట' చిత్రం గురించిన వార్తలు వస్తూనే ఉన్నాయి. మూడు విభిన్నమైన పాత్రల్లో సంపూర్నేష్‌ బాబు నటించాడు. ఎట్టకేలకు ఈ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న కొబ్బరిమట్ట చిత్రంలో ఏ స్థాయిలో పంచ్‌ లు పేలబోతున్నాయో ట్రైలర్‌ లో కత్తి మహేష్‌ పై వేసిన పంచ్‌ చూస్తేనే అర్థం అవుతుంది.

కత్తి మహేష్‌ కొబ్బరిమట్ట చిత్రంలో షకీలా భర్తగా కనిపించబోతున్నట్లుగా ట్రైలర్‌ ను చూస్తుంటే అనిపిస్తుంది. మీ భర్త ఎక్కడమ్మా అంటూ ప్రశ్నించిన సమయంలో ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది వాగుతున్నాడని నగర భహిష్కరణ చేశారంటూ షకీలా చెప్పిన డైలాగ్‌ కు ప్రేక్షకులు బాగా కనెక్ట్‌ అవుతున్నారు. కొన్నాళ్ల క్రితం కత్తి మహేష్‌ నగర భవిష్కర శిక్షను ఎదుర్కొన్న విషయం తెల్సిందే. ఇప్పుడు అదే విషయాన్ని కొబ్బరిమట్టలో పెట్టడంతో కామెడీ బాగా పండింది.

ఇక కొబ్బరిమట్ట చిత్రం ప్రీ రిలీజ్‌ వేడుక సందర్బంగా ఒక వ్యక్తి వచ్చి సంపూ కాళ్లు పట్టుకోవడం జరిగింది. నిర్మాత డబ్బులు ఇస్తే పట్టుకున్నట్లుగా ఆ వ్యక్తి చెప్పడం మరింత కామెడీని పంచింది. ఇక సినిమాలో ఎన్నెన్ని కామెడీ పంచ్‌ లు ఉంటాయో అంటూ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రియల్‌ ఇన్సిడెంట్స్‌ పై సినిమాల్లోని పవర్‌ ఫుల్‌ సీన్స్‌ పై కామెడీ పంచ్‌ లను సంపూర్నేష్‌ బాబు వేయనున్నాడని ప్రేక్షకులు మరియు సినీ వర్గాల వారు అంతా కూడా కొబ్బరిమట్ట కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.