Begin typing your search above and press return to search.

ఓటీటీలో 80 కోట్ల రేంజ్ ప‌లుకుతుందా సాబ్?

By:  Tupaki Desk   |   7 Sept 2020 1:00 PM IST
ఓటీటీలో 80 కోట్ల రేంజ్ ప‌లుకుతుందా సాబ్?
X
ఈ నాలుగైదు నెల‌లుగా థియేట్రిక‌ల్ రిలీజ్ అన్న‌ది ఆడియెన్ మ‌ర్చిపోయారు. ఓటీటీలు బుల్లితెర‌కు అడిక్ట్ అయిపోయారు. ఇక ఇదే అద‌నుగా స‌బ్ స్క్రైబ‌ర్ల‌ను పెంచుకుంటూ ఓటీటీలు ఆడుతున్న ఆట చూస్తున్న‌దే. ఇక ఈ వేదిక‌పై పెద్ద స్టార్లకు ఎలాంటి డిమాండ్ ప‌ల‌క‌నుంది? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది. ఇక టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ వ‌ర్సెస్ కోలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ గేమ్ పైనా ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఓవైపు ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన వకీల్ సాబ్ ..మ‌రోవైపు త‌మిళ హీరో విజ‌య్ న‌టించిన మాస్టార్ ఓటీటీ రిలీజ్ కి రెడీ అవుతున్నాయ‌న్న వార్త హీటెక్కిస్తుండ‌గా.. ఈ సినిమాల బిజినెస్ గురించి ఆస‌క్తిక‌ర చ‌ర్చ మొద‌లైంది.

తాజాగా సుమారు రూ.80 కోట్ల‌కి ఓ స్టార్ హీరో సినిమా డైరెక్ట్ ఓటీటీ ప‌ద్ధ‌తిలో విడుద‌ల చేయ‌డానికి అమెజాన్ ప్రైమ్ వాళ్లు డీల్ కుదుర్చుకున్నార‌నే టాక్ ఉంది. అయితే ఇది ప‌వ‌న్ క‌ళ్యాణ్ వ‌కీల్ సాబ్ అనే అంతా అనుకుంటున్నారు. వాస్త‌వానికి ఇది వ‌కీల్ సాబ్ సినిమా కానేకాదు అనే కామెంట్స్ ఓ సెక్ష‌న్ లో వినిపిస్తున్నాయి.

కోలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ విజ‌య్ నెక్ట్స్ మూవీ `మాస్ట‌ర్`కి ఇంత డీల్ ప‌లికింద‌ట‌. ఈ సినిమాను డైరెక్ట్ ఓటీటీ ప‌ద్ధ‌తిలో విడుద‌ల చేయ‌డానికి అమెజాన్ డీల్ కుదుర్చుకుంద‌ట‌. అయితే వ‌కీల్ సాబ్ ను కూడా రిలీజ్ చేయాల్సిందిగా అమెజాన్ ప్రైమ్ వాళ్లు దిల్ రాజుకు ఓ ప్రపోజల్ పెట్టిన‌ట్లుగా తెలిసింది. అయితే దిల్ రాజు దీనికి ఒప్పుకోవ‌డం లేద‌ని అంటున్నారు. త‌మిళ ప‌వ‌ర్ స్టార్ మూవీకి ఓటీటీ ప‌రంగా లైన్ క్లియ‌ర్ అవుతున్నా.. వ‌కీల్ సాబ్ నిర్మాత మాత్రం ఇంకా థియేట్రిక‌ల్ రిలీజ్ పై హోప్ తోనే ఉన్నార‌ని దీనిని బట్టి అర్థ‌మ‌వుతోంది.