Begin typing your search above and press return to search.

సోలో బ్రతుకే సో బెటర్‌' కు కలిసి వచ్చే అంశం

By:  Tupaki Desk   |   25 Dec 2020 9:15 AM IST
సోలో బ్రతుకే సో బెటర్‌ కు కలిసి వచ్చే అంశం
X
కరోనా కారణంగా విధించిన లాక్‌ డౌన్‌ సమయంలో కనీసం తిండి కూడా కష్టం అయ్యింది. అలాంటి సమయంలో ఎవరు పెద్దగా థియేటర్ల గురించి సినిమాల గురించి ఆలోచించలేదు. మెల్ల మెల్లగా పరిస్థితులు కుదుట పడ్డాయి.. వైరస్‌ అదుపులోకి రాకున్నా కూడా జనాలు అలవాటు పడిపోయి జాగ్రత్తగా ఉంటుంన్నారు. దాదాపుగా 10 నెలల పాటు థియేటర్లు మూత పడ్డాయి. ఇటీవల ఓపెన్‌ అయినా కూడా పెద్ద సినిమాలు విడుదల కాకపోవడంతో జనాలు థియేటర్ల వైపు చూడటం లేదు. ఎట్టకేలకు తెలుగు రాష్ట్రాల్లో ఒక పెద్ద సినిమా సందడి చేయబోతుంది. అదే సాయి ధరమ్‌ తేజ్ నటించిన సోలో బ్రతుకే సో బెటర్‌. సుబ్బు దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నేడు విడుదల కాబోతుంది.

కొన్ని నెలల తర్వాత రాబోతున్న సినిమా అవ్వడంతో జనాల నుండి ఎలాంటి రెస్పాన్స్‌ ఉంటుందో.. కరోనా భయం ఇంకా ఉన్న కారణంగా జనాలు థియేటర్లకు వస్తారో రారో అనే భయం ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది. సోలో బ్రతుకే సో బెటర్ సినిమా ను విడుదల చేయడం అనేది చాలా పెద్ద ఛాలెంజింగ్ విషయం అంటూ అంతా అభిప్రాయం వ్యక్తం చేశారు. వ్యాక్సిన్‌ వచ్చే వరకు థియేటర్లకు జనాలు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేశారు. కాని సోలో బ్రతుకే సో బెటర్‌ సినిమాకు మంచి రెస్పాన్స్‌ దక్కడంతో అంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చాలా ఏరియాల్లో అడ్వాన్స్‌ బుకింగ్‌ భారీగా జరిగింది.

చాలా నెలల తర్వాత థియేటర్లు ఓపెన్‌ అవ్వడం ఒక పెద్ద సినిమా రావడం వల్ల జనాలు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. థియేటర్లకు 50 శాతం ఆక్యుపెన్సీతో అనుమతులు ఇచ్చారు. కనుక ఎక్కువ శాతం థియేటర్లు హౌస్‌ ఫుల్‌ అవుతున్నాయి. కొన్ని ఏరియాల్లో రెండు మూడు స్క్రీన్‌ ల్లో సినిమాను విడుదల చేస్తున్నారు. చాలా గ్యాప్‌ తర్వాత వచ్చిన మొదటి సినిమా అవ్వడం అనేది ఈ తేజూ సినిమాకు కలిసి వచ్చే అంశం. సినిమా టాక్‌ తో సంబంధం లేకుండా జనాలు థియేటర్లకు వెళ్లాలని భావిస్తున్నారు. భారీగా టికెట్లు అమ్ముడు పోతున్న నేపథ్యంలో ఇతర సినిమాలు కూడా క్యూ కట్టే అవకాశం లేకపోలేదు.