Begin typing your search above and press return to search.

అన్ని భాషలను చుట్టేస్తూ నెం.1 గా నిలిచిన అరవింద

By:  Tupaki Desk   |   10 April 2021 1:30 AM GMT
అన్ని భాషలను చుట్టేస్తూ నెం.1 గా నిలిచిన అరవింద
X
టాలీవుడ్‌ లో ప్రస్తుతం టాప్‌ స్టార్‌ హీరోయిన్‌ ఎవరు అంటే ఠక్కున వినిపించే పేర్లలో ముద్దుగుమ్మ పూజా హెగ్డే పేరు ముందు వరుసలో ఉంటుంది. టాలీవుడ్‌ లో మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ గా మారిపోయిన ఈ అమ్మడు చాలా తెలివిగా అన్ని భాషలకు సమ ప్రాముఖ్యత ప్రాధాన్యం ఇస్తూ సినిమాలు చేస్తుంది. కేవలం టాలీవుడ్‌ పై ఫోకస్‌ పెట్టకుండా బాలీవుడ్‌ మరియు కోలీవుడ్‌ ల్లో కూడా ఈమె సినిమాలు చేస్తోంది. ఈమె వరుసగా సినిమాలకు కమిట్‌ అవుతూ ప్రస్తుతం సౌత్‌ లోనే టాప్‌ స్టార్‌ హీరోయిన్‌ గా పేరు దక్కించుకుంది. పారితోషికం విషయంలోనే కాకుండా పాపులారిటీ విషయంలో మరియు సినిమాలు చేస్తున్న విషయంలో కూడా ఈమెనే నెం.1 అంటున్నారు.

టాలీవుడ్‌ టాప్‌ స్టార్‌ హీరోయిన్‌ అయిన పూజా హెగ్డే తమిళంలో ఇటీవలే సూపర్‌ స్టార్‌ విజయ్‌ హీరోగా నటిస్తున్న 65వ సినిమాలో ఎంపిక అయ్యింది. ఆ సినిమా షూటింగ్‌ ఇటీవలే ప్రారంభం అయ్యింది. ఇక బాలీవుడ్‌ లో సల్మాన్‌ ఖాన్‌ వంటి సూపర్‌ స్టార్‌ తో నటిస్తోంది. మరో వైపు యంగ్‌ హీరో రణవీర్‌ సింగ్‌ సినిమాలో కూడా ఈమె నటించబోతుంది. మొత్తంగా బాలీవుడ్‌ లో కూడా యమ బిజీగా ఈ అమ్మడు సినిమాలు చేస్తుంది. తెలుగు మరియు తమిళంతో పాటు బాలీవుడ్‌ లో కూడా బిజీగా మారిన సౌత్‌ హీరోయిన్స్‌ చాలా తక్కువ మంది ఉంటారు. వారిలో ఈ అమ్మడు ఒకరు.

తెలుగులో అరవింద సమేత చిత్రంతో పాటు పలు సినిమాల సక్సెస్‌ తో చాలా బిజీ హీరోయిన్‌ గా మారిపోయింది. ఇక పూజా హెగ్డే నటించిన రాధే శ్యామ్‌ మరియు మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఆచార్య సినిమాలో కూడా ఈమె కీలక పాత్రలో కనిపించబోతుందని అంటున్నారు. ఇదే సమయంలో ఈమె మహేష్‌ బాబు త్రివిక్రమ్‌ కాంబో చర్చలో ఉంది. ఆ సినిమాలో ఈమె నటించబోతుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు చెబుతున్నారు. మొత్తానికి సౌత్‌ లో ఈ అమ్మడు నెం.1 హీరోయిన్‌ అనడంలో సందేహం లేదు.