Begin typing your search above and press return to search.
మార్కెట్లో కోటిన్నర పోస్తున్న బాలయ్య
By: Tupaki Desk | 4 April 2017 10:28 AM ISTనందమూరి బాలకృష్ణ-పూరీ జగన్నాధ్ ల కాంబనేషన్ లో కొత్త సినిమా శరవేగంగా రూపు దిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఇంకా టైటిల్ డిసైడ్ చేయని ఈ మూవీ.. ఇప్పుడు సెకండ్ షెడ్యూల్ వరకూ వచ్చేసింది. రెండు వారాల పాటు సాగే ఈ షెడ్యూల్ లో కీలకమైన సీన్స్ తో పాటు యాక్షన్ సన్నివేశాలను కూడా తెరకెక్కించనున్నారట.
అయితే.. ఈ షెడ్యూల్ మొత్తం ఒక సెట్ లోనే జరగనుండడం విశేషం. దీని కోసం కోటిన్నర రూపాయలు ఖర్చుతో భారీగా వేశారు. ఓ కాలనీ.. మార్కెట్ సెట్ కోసమే ఇంత మొత్తం ఖర్చు పెట్టేశారు. మూవీలో మెయిన్ హీరోయిన్ కూడా ఈ షెడ్యూల్ లో నటించనుందని అంటున్నారు. అంటే ముగ్గురు హీరోయిన్లను నటించే ఈ బాలయ్య సినిమాకి సంబంధించి లీడ్ హీరోయిన్ ఎవరో ఈ షెడ్యూల్ ద్వారా తెలిసిపోనుందన్న మాట. శరవేగంగా సినిమాలు తీసే దర్శకుడు పూరీ జగన్నాధ్.. బాలయ్యతో కూడా తన స్టైల్ లో చేసేస్తుండడం విశేషం.
ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తి చేసుకోగా.. హైద్రాబాద్ పరిసరాల్లోని ఓ అల్యూమినియం ఫ్యాక్టరీలో చిత్రీకరించారు. ఇక్కడ 50 లక్షల రూపాయల వెచ్చించి రైల్వే సెట్ వేయగా.. భారీ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించారు. మరో హీరోయిన్ ముస్కాన్ తో పాటు మూవీలోని కీలక పాత్రధారులు తొలి షెడ్యూల్ లో పాల్గొన్నారు. భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నాడు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/