Begin typing your search above and press return to search.

పవర్ స్టార్ సినిమాలకు భారీ దెబ్బ పడిందా...?

By:  Tupaki Desk   |   20 Jun 2020 7:00 AM GMT
పవర్ స్టార్ సినిమాలకు భారీ దెబ్బ పడిందా...?
X
స్టార్ హీరోలతో సినిమా అంటేనే బడ్జెట్ లెక్కల విషయంలో నిర్మాతలు ఒక నిర్ణయానికి రాలేరు. సినిమా స్టార్ట్ చేయకముందు అనుకున్న బడ్జెట్ సినిమా కంప్లీట్ అయ్యే సమయానికి మారుతూ ఉంటుంది. కొన్నిసార్లు నిర్మాతలు బడ్జెట్ అనుకున్న దానికంటే రెండింతలు పెట్టాల్సి వస్తుంది కూడా. సినిమా హిట్ అయితే ఆ నిర్మాతలు పెట్టిన పెట్టుబడికి లాభాలు తెచ్చుకుంటారు.. అదే ప్లాప్ అయితే నష్టాల్లో కూరుకుపోతుంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న సినిమాల విషయంలో ఇదే జరుగుతోందట.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీగా 'వకీల్ సాబ్' రూపొందుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా దిల్ రాజు మరియు బోణీ కపూర్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా హిందీలో అమితాబ్ నటించిన 'పింక్' చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతోంది. ఈ సినిమాతో పాటు తన కెరీర్లో 27వ చిత్రాన్ని కూడా లైన్లో పెట్టాడు పవన్. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాని స్టార్ ప్రొడ్యూసర్ ఏఎమ్ రత్నం నిర్మిస్తున్నారు. ఇదిలా ఉండగా 'వకీల్ సాబ్' సినిమాకి ఆల్రేడీ అనుకున్న బ‌డ్జెట్ దాటిపోయిందట.

కరోనా మహమ్మారి కారణంగా చాలా కాల్షీట్స్ వేస్ట్ అవ్వ‌డం మరియు ప‌వ‌న్ షూటింగ్స్ వ‌చ్చినా కూడా తన పర్సనల్ ప‌నులు మీద బ‌య‌ట‌కు వెళ్లిపోవ‌డం వంటి కారణాల వలన 'వ‌కీల్ సాబ్' షూటింగ్ డేస్ పెరిపోయాయట. కమర్షియల్ ఎలిమెంట్స్ లేని 'పింక్' సినిమా రీమేక్ మీద ఎక్కువ మొత్తంలో డబ్బులు పెట్టినా అవి తిరిగి వస్తాయో లేదో అని మేకర్స్ భయపడుతున్నారట. ఈ సినిమా కోసం 2 కోట్లు పెట్టి అన్నపూర్ణ‌ స్టూడియోస్ లో వేసిన కోర్టు సెట్ లో మరో అయిదు రోజుల షెడ్యూల్ పెండింగ్ ఉందట. అయితే ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ప‌వ‌న్ షూటింగ్స్ కి రాలేకపోయాడు.

మరోపక్క క్రిష్ తో చేస్తున్న సినిమా పరిస్థితి కూడా ఇలానే ఉందట. ఈ మూవీ కోసం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో వేసిన భారీ సెట్ తాజాగా ప‌డిన భారీ వర్షాల‌కు మొత్తం తుడుచుపెట్టుకుపోయింద‌ట‌. ఇప్పటికే ఈ సెట్ కోసం దాదాపు 2.5 కోట్లు వెచ్చించారట. ఇప్పుడు ఈ సెట్ ని బాగు చేయాలంటే మ‌రో కోటి వ‌ర‌కు అవుతుంద‌ని అంచనా వేస్తున్నారట. కారణాలు ఏమైనా ఇలా అనుకోని ఖర్చుల వచ్చిపడటంతో స్టార్ హీరోతో సినిమాలు తీసినా ఏం లాభం అని ప్రొడ్యూసర్స్ అనుకుంటున్నారట.