Begin typing your search above and press return to search.

ప్రభాస్ మూవీ వెనుక ఇంత కథ నడిచిందా...?

By:  Tupaki Desk   |   27 Aug 2020 2:30 AM GMT
ప్రభాస్ మూవీ వెనుక ఇంత కథ నడిచిందా...?
X
కరోనా కారణంగా సినీ ఇండస్ట్రీ క్లోజ్ అవడంతో సినిమాకు సంబంధించిన అప్డేట్స్ లేకుండా పోయాయి. ఇలాంటి సమయంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మీడియాకి.. సోషల్ మీడియాకి కావాల్సినంత పని కల్పించాడు. వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్ అనౌన్స్ చేస్తూ అభిమానులను ఖుషీ చేస్తున్నాడు. ప్రస్తుతం రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో 'రాధే శ్యామ్' అనే పీరియాడికల్ లవ్ స్టోరీలో నటిస్తున్న ప్రభాస్.. 'మహానటి' ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాడు. ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నిర్మించడానికి ప్రొడ్యూసర్ అశ్వినీదత్ సన్నాహకాలు చేస్తున్నారు. ఇదే క్రమంలో ''ఆదిపురుష్'' అనే మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో నటించబోతున్నట్లు ప్రకటించారు ప్రభాస్. ఈ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెడుతున్నాడు. 'తానాజీ' వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన ఓం రౌత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. 3-డీ లో రూపొందనున్న ఈ సినిమాని టీ - సిరీస్ భూషణ్ కుమార్ - కృష్ణ కుమార్ - ప్రసాద్ సుతార్ - రాజేష్ నాయర్ - ఓం రౌత్ లు కలిసి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అయితే ప్రభాస్ నెక్స్ట్ ప్రాజెక్ట్ పై అనేక వార్తలు వస్తున్న సమయంలో ప్రభాస్ 'ఆదిపురుష్' చిత్రాన్ని ప్రకటించి అందర్నీ షాక్ కి గురి చేశాడు.

నిజానికి 'అర్జున్ రెడ్డి' డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాతో ప్రభాస్ సినిమా ఉండబోతోందని వార్తలు వచ్చాయి. ఇప్పటికే టీ - సిరీస్ వారికి కమిట్మెంట్ ఇచ్చిన సందీప్.. ప్రభాస్ కోసం ఓ యాక్షన్ ఎంటర్టైనర్ ప్లాన్ చేశారట. అందులోనూ 'సాహో' 'రాధే శ్యామ్' చిత్రాలకు ప్రొడ్యూసర్స్ గా ఉన్న టీ - సిరీస్ భూషణ్ కుమార్ తో మరో సినిమా చేయడానికి ప్రభాస్ అంగీకరించాడట. దీంతో సందీప్ రెడ్డి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా టీ - సిరీస్ వారు ఓ ప్రాజెక్ట్ సెట్ చేయాలని భావించారట. అయితే సందీప్ చెప్పిన స్టోరీ నచ్చకపోవడంతో ఇది రూపుదాల్చలేదు. అదే సమయంలో టీ-సిరీస్ ఆధ్వర్యంలో ఓం రౌత్ చెప్పిన ఎపిక్ కాన్సెప్ట్ నచ్చడంతో ఈ ప్రాజెక్ట్ ని ముందుకు తీసుకొచ్చారట. పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ కి ఇలాంటి సమయంలో 'బాహుబలి' స్థాయిలో మరో సినిమా పడితే బాగుంటుందని 'ఆదిపురుష్' కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తోంది. ఒకవేళ సందీప్ రెడ్డి చెప్పిన స్టోరీ ప్రభాస్ ని మెప్పించి ఉంటే టీ - సిరీస్ బ్యానర్ లో ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కేది. మరి సందీప్ నెక్స్ట్ మూవీ టీ - సిరీస్ బ్యానర్ లో ఉంటుందో లేదో చూడాలి.