Begin typing your search above and press return to search.

తమలపాకులాంటి పిల్లకు తగ్గని డిమాండ్!

By:  Tupaki Desk   |   29 March 2021 2:30 PM GMT
తమలపాకులాంటి పిల్లకు తగ్గని డిమాండ్!
X
నింగి నుంచి జారిపడిన జాబిలమ్మను .. పాలకుండలో పడిపోయిన పాలపుంతను ఎప్పుడైనా చూశారా? పోనీ వెన్నకొండల మధ్య వెలిసిన పాల సరస్సును .. ఇంతిగా మారిపోయిన ఇంద్రధనుస్సును ఎక్కడైనా చూశారా? అదెలా సాధ్యం? అని ప్రశ్న అందరిలోను తలెత్తడం సహజం. కుదరదు గనుకనే వాటికి దగ్గరగా ఉన్న అందాన్ని చూసి అనుభూతి చెందడమే. అంతటి అందగత్తె ఎవరబ్బా? ఆ సొగసుల సొంపాపిడి ఎక్కడుందబ్బా? అని టెన్షన్ పడవలసిన పనిలేదు. తమలపాకులా .. తామరపూవు రేకులా నాజూకుగా కనిపించే ఆ పిల్ల పేరు .. ప్రియాంక అరుళ్ మోహన్.

'నానీస్ గ్యాంగ్ లీడర్' సినిమా ద్వారా ఈ అమ్మాయి తెలుగు తెరకి పరిచయమైంది. అందం .. అమాయకత్వం కలిసిన కళ్లు .. మీగడతో చేసిన చెక్కిళ్లు .. పగడాలు పొదిగిన పెదాలతో ఈ పిల్ల ఆకట్టేసుకుంది. చిన్నపాటి నవ్వుకే చెక్కిళ్లు చితికిపోతాయేమోనని పిల్లగాళ్లను టెన్షన్ పెట్టేంత సుకుమారంగా ఈ బ్యూటీ కనిపిస్తుంది. కొంటె చూపులు నేర్చిన కొండపల్లి బొమ్మలా అనిపించే ఈ అమ్మాయికి తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలోనే శర్వానంద్ సరసన ఈ పిల్ల చేసిన 'శ్రీకారం' విడుదలైంది. అయితే ఆశించిన స్థాయిలో ఈ సినిమా ఆధారణ పొందలేకపోయింది.

సినిమా పరాజయం హీరో కంటే ముందుగా హీరోయిన్ కెరియర్ పై పడటం విచిత్రం. అలాగే ఈ సినిమా ప్రభావం ఈ పిల్లకి వచ్చే అవకాశాలపై పడుతుందేమోనని అనుకున్నారు. కానీ అలాంటి ఎఫెక్ట్ ఏమీ లేదనే అంటున్నారు. 'శ్రీకారం' రిలీజ్ తరువాత కూడా ఈ అమ్మాయిని సంప్రదిస్తున్న టాలీవుడ్ దర్శక నిర్మాతల సంఖ్య ఎక్కువగానే ఉందట. ప్రాజెక్టులు ఏమిటనే విషయం అటుంచితే, త్వరలో ఈ అమ్మాయి రామ్ .. నితిన్ .. నాగచైతన్య సరసన కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే టాక్ వినిపిస్తోంది. ఇక కోలీవుడ్ లో కూడా ఈ కోమలి బిజీ అవుతోంది. డైమండ్ కి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది కదా అనేది ఫ్యాన్స్ మాట. కనుక ఇప్పట్లో ఈ చేపకళ్ల సుందరి కెరియర్ కి ఢోకా లేనట్టే!