Begin typing your search above and press return to search.

ఆ డైరెక్టర్ కోసం అప్పుడే కర్చీఫ్స్ వేయడం స్టార్ట్ చేశారా..?

By:  Tupaki Desk   |   27 Nov 2022 3:30 AM GMT
ఆ డైరెక్టర్ కోసం అప్పుడే కర్చీఫ్స్ వేయడం స్టార్ట్ చేశారా..?
X
సినీ ఇండస్ట్రీలో సక్సెస్ మాత్రమే మాట్లాడుతుంది. ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ పడితే.. ఆ సినిమాలో భాగమైన ప్రధాన నటీనటులు మరియు సాంకేతిక నిపుణులకు వరుస ఆఫర్స్ వస్తాయి. భారీగా అడ్వాన్స్‌ లు చెల్లించి లాక్ చేసి పెట్టుకోడానికి నిర్మాతలు రెడీగా ఉంటారు. ఇప్పుడు యంగ్ డైరెక్టర్ ప్రదీప్ రంగనాథన్ విషయంలోనూ అదే జరుగుతోంది.

'కోమలి' అనే తమిళ్ చిత్రంతో ప్రదీప్ రంగనాథన్ డైరెక్టర్ గా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. జయం రవి - కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన ఈ కామెడీ డ్రామా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఈ క్రమంలో మూడేళ్ళ తర్వాత ఇప్పుడు ''లవ్ టుడే'' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన 'లవ్ టుడే' చిత్రానికి ప్రదీప్ రంగనాథన్ దర్శకత్వం వహించడమే కాదు.. కథానాయకుడి పాత్ర పోషించాడు. ఇది చిన్న సినిమాగా వచ్చి కోలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. 5 కోట్లతో తీస్తే, ఏకంగా 70 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది.

'లవ్ టుడే' సినిమాతో డైరెక్టర్ కమ్ యాక్టర్ గా ప్రదీప్ రంగనాథన్ మంచి పేరు తెచ్చుకున్నాడు. సక్సెస్ తో పాటుగా సూపర్ స్టార్ రజినీ కాంత్ లాంటి సినీ ప్రముఖుల ప్రశంసలు అందుకున్నాడు. దీంతో రెండు చిత్రాలతో ప్రదీప్ క్రేజీ డైరెక్టర్ గా మారిపోయాడు.

తమిళ్ లో ఘన విజయం సాధించిన 'లవ్ టుడే' చిత్రాన్ని అగ్ర నిర్మాత దిల్ రాజు తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేసారు. శుక్రవారం థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. సానుకూలమైన రివ్యూలు వచ్చాయి. ఫస్ట్ డే కంటే రెండో రోజు కలెక్షన్స్ బాగున్నాయని చెబుతున్నారు.

అయితే ఇప్పుడు ప్రదీప్ రంగనాథన్ కు తమిళంతో పాటుగా తెలుగులోనూ క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయని తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని పెద్ద నిర్మాణ సంస్థల నుంచి దర్శకుడికి భారీ అడ్వాన్సులు ఆశ చూపుతున్నారట. ఇప్పటికే ఒక ప్రాజెక్ట్ కి సైన్ చేసినట్లుగా టాక్ నడుస్తోంది.

ప్రస్తుతం తెలుగు తమిళ భాషల్లో పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ని బ్యాంక్రోల్ చేస్తున్న నిర్మాత శ్రీనివాస చిట్టూరి.. ప్రదీప్ రంగనాథన్ తో ఓ బైలింగ్విల్ చేయడానికి అడ్వాన్స్ చెల్లించినట్లు చెప్పుకుంటున్నారు. అలానే 'లవ్ టుడే' ని తెలుగులో రిలీజ్ చేసిన దిల్ రాజ్ కూడా దర్శకుడితో ఓ సినిమా చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నాడట. ఇందులో నిజమెంతో తెలియదు కానీ.. ప్రదీప్ కు వరుస అవకాశాలు తలుపు పడుతున్నాయని తెలుస్తోంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.