Begin typing your search above and press return to search.

గ‌ప్ చుప్ టాక్‌: యంగ్ హీరోలంద‌రికీ ప‌ల్లవే లిఫ్టివ్వాలి!

By:  Tupaki Desk   |   3 March 2021 11:30 PM GMT
గ‌ప్ చుప్ టాక్‌: యంగ్ హీరోలంద‌రికీ ప‌ల్లవే లిఫ్టివ్వాలి!
X
అక్కినేని నాగ‌చైత‌న్య‌- సాయిప‌ల్ల‌వి జంట‌గా శేఖ‌ర్ క‌మ్ముల తెర‌కెక్కిస్తున్న ల‌వ్ స్టోరి త్వ‌ర‌లో రిలీజ్ కి రెడీ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌లే `సారంగ‌ద‌రియా..` సాంగ్ ఒక్క‌సారిగా హీట్ పెంచింది. ప్రోమోలో సాయిప‌ల్ల‌వి అద‌ర‌గొట్టింది. పాట ఆద్యంతం డ్యాన్సుల‌తో అద‌ర‌గొట్టిన సాయి ప‌ల్ల‌వి ముందు ఇంకేదీ క‌నిపించ‌లేదన్న చ‌ర్చా సాగుతోంది. ఒక ర‌కంగా సాయి ప‌ల్ల‌వి ఉంటే చాలు సినిమా చూసేయొచ్చ‌న్న టాక్ యువ‌త‌రంలో మ‌ళ్లీ మొద‌లైంది.

ఒక్క పాట‌తో మొత్తం ఎటెన్ష‌న్ తీసుకొచ్చేసింది సాయిప‌ల్ల‌వి. నిన్న మొన్న‌టి వ‌రుకు అస‌లు `ల‌వ్ స్టోరి` అనే సినిమా వ‌స్తుంద‌నే విష‌యం కూడా ఎవ‌రికీ పెద్ద‌గా తెలీదు. ప‌బ్లిసిటీ అంత వీక్ గా క‌నిపించింది. కానీ ఇప్పుడు `సారంగద‌రియా..` పాట‌తో అంతా మారిపోయింది. ఇంత‌కీ ఈ సినిమా ఎప్పుడు విడుద‌లవుతుంది? అంటూ ఆరాలు తీస్తున్నారనేది ట్రేడ్ టాక్.

గ‌తంలో `ఫిదా` సినిమాకి సాయిప‌ల్ల‌వి వ‌ల్ల‌నే క్రేజు ప‌దింత‌లైంది. ఈ అమ్మాయి ఉంటే చాలు హిట్టు అనే టాక్ స్థిర‌ప‌డిపోయింది. ఆ త‌రువాత నాని న‌టించిన `మిడిల్ క్లాస్ అబ్బాయి`కి త‌నే పెద్ద ప్ల‌స్. ఆ సినిమా ఓపెనింగ్స్ కి ఈ బ్యూటీ ప్ర‌తిభ కార‌ణం అయింది. ఈ నేథ్యంలో మ‌ళ్లీ నాని న‌టిస్తున్న `శామ్ సింగ్ రాయ్` కి.. రానా `విరాటప‌ర్వం`కి కూడా ఈ బ్యూటీ హెల్ప్ అవుతుంద‌నే టాక్ వినిపిస్తోంది.

మొత్తానికి వ‌చ్చిన‌ప్పుడల్లా కొన్ని రోజుల పాటు సాయిప‌ల్ల‌వి పేరే మార్మోగుతోంది. ప్రోమో.. టీజ‌ర్ .. సాంగ్ అంటూ సాయిప‌ల్ల‌వి బిట్ ఉర్రూత‌లూగించేస్తున్నాయ్. ఆ క్ర‌మంలోనే త‌న‌పైనే ఫోక‌స్ చేస్తూ హీరోల్ని మ‌ర్చిపోతున్నారంతా. ఏదేమైనా మ‌న యువ‌హీరోలంద‌రికీ సాయిప‌ల్ల‌వి లక్కీ ఛామ్ అవుతోంద‌న్న టాక్ బ‌లంగా ఉంది. రౌడీ బేబీ సాయిప‌ల్ల‌వి ఎక్క‌డ ఉంటే అక్క‌డ త‌నే క‌నిపిస్తుంది అంతే!