Begin typing your search above and press return to search.
యూట్యూబ్ మిలియన్స్ తో ‘రెడ్’ కు రూ. 12 కోట్లు
By: Tupaki Desk | 1 May 2020 12:00 PM ISTఎనర్జిటిక్ స్టార్ రామ్ చాలా కాలం తర్వాత ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో సక్సెస్ ను దక్కించుకున్నాడు. పూరి జగన్నాధ్ దర్శకత్వంలో రూపొందిన ఆ సినిమా తెలుగులోనే కాకుండా హిందీలో డబ్ అయ్యి శాటిలైట్ మరియు యూట్యూబ్ లో కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. రామ్ కు ఉత్తరాదిన అరుదైన రికార్డ్ ఉంది. ఇప్పటి వరకు సౌత్ హీరోల్లో ఎవరికి లేని రికార్డు రామ్ కు దక్కింది. ఇస్మార్ట్ శంకర్.. ఉన్నది ఒక్కటే జిందగీ.. నేను శైలజ.. హలో గురు ప్రేమ కోసమే ఈ నాలుగు సినిమాలు కూడా హిందీ డబ్బింగ్ వర్షన్ యూట్యూబ్ లో వంద మిలియన్ లు అంతకు మించి వ్యూస్ ను దక్కించుకున్నాయి.
నేను శైలజ మరియు హలో గురు ప్రేమ కోసమే హిందీ వర్షన్ లు రెండు వందల మిలియన్ ల వ్యూస్ కు చేరువలో ఉన్నాయి. ఇవే కాకుండా మరికొన్ని రామ్ చిత్రాలు కూడా యూట్యూబ్ లో భారీ వ్యూస్ ను రాబట్టడంతో ఆయన కొత్త సినిమా ‘రెడ్’ కు హిందీ డబ్బింగ్ రైట్స్ భారీ మొత్తంను ప్రముఖ సంస్థ ఆఫర్ చేసినట్లుగా తెలుస్తోంది. కిషోర్ తిరుమల దర్శకత్వంలో స్రవంతి రవికిషోర్ నిర్మిస్తున్న రెడ్ సినిమాను 12 కోట్ల ఆఫర్ వచ్చినట్లుగా ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.
యూట్యూబ్ తో పాటు శాటిలైట్ లో కూడా రామ్ సినిమాలను ఉత్తరాది ప్రేక్షకులు అమితంగా చూస్తున్న కారణంగా ఇంత భారీ రేటు పలికినట్లుగా చెబుతున్నారు. రెడ్ సినిమా కూడా హిట్ అయ్యి హిందీలో కూడా ఆకట్టుకుంటే భవిష్యత్తులో రామ్ సినిమాలు ఉత్తరాదిన థియేట్రికల్ రైట్స్ కూడా అమ్ముడు అయ్యే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి సౌత్ హీరోలు ఒక్కరొక్కరుగా బాలీవుడ్ ప్రేక్షకుకు దగ్గరవుతూ వస్తున్నారు.