Begin typing your search above and press return to search.

ఎక్కడ చూసినా ఈ జాతి రత్నాలే కనిపిస్తున్నారు

By:  Tupaki Desk   |   6 March 2021 3:30 AM GMT
ఎక్కడ చూసినా ఈ జాతి రత్నాలే కనిపిస్తున్నారు
X
నవీన్ పొలిశెట్టి హీరోగా ప్రియదర్శి మరియు రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో నటించిన జాతిరత్నాలు మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా ప్రమోషన్‌ బాధ్యత మొత్తం కూడా నవీన్ తన భుజాలపై వేసుకుని మరో ప్లాన్‌ చేసుకున్నాడు. సోషల్‌ మీడియా.. వెబ్‌ మీడియా నుండి మొదలుకుని ఎలక్ట్రానిక్ మీడియా ఇతర మీడియాల్లో కూడా జాతి రత్నాల సినిమాకు సంబంధించిన టాపిక్స్‌ చర్చ జరిగేలా ప్లాన్‌ చేశారు. ఈటీవీ.. మాటీవీ.. జీటీవీ ఇలా అన్ని టీవీల్లోని ఫేమస్‌ రియాల్టీ షోల్లో జాతి రత్నాలు టీమ్‌ పాల్గొని సందడి చేసి తమ సినిమా ను ప్రచారం చేసుకుంటున్నారు. ఇక యూట్యూబ్‌ లో నవీన్‌ వీడియోలు వరుసగా ట్రెండ్డింగ్‌ లో ఉంటున్నాయి.

సినిమా ట్రైలర్ ను ప్రభాస్ చేతుల మీదుగా విడుదల చేయించేందుకు జాతి రత్నాలు టీమ్ మొత్తం కూడా ముంబయి వెళ్లారు. అక్కడ సినిమా షూటింగ్‌ లో ఉన్న ప్రభాస్ తో ట్రైలర్‌ ను లాంచ్ చేయించారు. ఆ సందర్బంగా షూట్‌ చేసిన వీడియో చాలా ఫన్‌ గా ఉండి ట్రైలర్‌ తో పాటు ఆ వీడియో కూడా అందరి దృష్టిని ఆకర్షించి సినిమా పై ఆసక్తిని పెంచుతోంది. వెళ్లిన ప్రతి షో లో ఇంటర్వ్యూలో ఇతర కార్యక్రమాల్లో నవీన్ పొలిశెట్టి ఎనర్జి మరియు ఆయన కామెడీ టైమింగ్ తో అదరగొట్టేస్తున్నాడు. మొత్తానికి జాతి రత్నాలు సినిమా అప్పుడే సగం సక్సెస్‌ అయినట్లే అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సినిమా లోని చిట్టి నీ నవ్వంటే.. అంటూ సాగే పాట శ్రోతలను ఉర్రూతలూగిస్తుంది. అలా ఎక్కడ చూసినా కూడా జాతి రత్నాలే సందడి చేస్తున్నారు. ఈనెల 11న రాబోతున్న ఈ సినిమా లో కొత్త అమ్మాయి ఫరియా హీరోయిన్ గా పరిచయం అవుతోంది. ఆమె కూడా ప్రమోషన్‌ కార్యక్రమాలన్నింటికి నవీన్ తో కలిసి హాజరు అవుతూ సినిమా క్రేజ్‌ ను పెంచేస్తోంది. ఫరియా సింపుల్‌ గా పక్కింటి అమ్మాయి మాదిరిగా ఉంది అన్న టాక్‌ వినిపిస్తుంది. మహానటి దర్శకుడు నాగ్‌ అశ్విన్ నిర్మించిన ఈ సినిమా కు అనుదీప్ కేవీ దర్శకత్వం వహించాడు.