Begin typing your search above and press return to search.

ఫోకస్: సినీ పరిశ్రమలో మార్పు ఖాయమా?

By:  Tupaki Desk   |   16 April 2020 3:30 AM GMT
ఫోకస్: సినీ పరిశ్రమలో మార్పు ఖాయమా?
X
కాలగమనంలో అన్నీ కనుమరుగైపోతుంటాయి. కాలంతోపాటు మనుషులు మారుతుంటారు. ల్యాండ్ లైన్ ఎస్టీడీ - ఐసీడీలు వచ్చిన కొత్తలో అబ్బో అని అందరూ వాటికి అలవాటుయ్యారు. ఆ తరువాత సెల్ ఫోన్ల రాక మొత్తం ల్యాండ్ ఫోన్లనే ఎత్తేసింది. మనిషి కూడా దానికి టర్న్ అయిపోయాడు. ఫోన్లతో కెమెరాలు - వీడియో గ్రాఫింగ్ పరికరాలు గల్లంతయ్యాయి.

*మార్పు మంచిదే..

సమాజంలో వస్తున్న మార్పులను గమనించి వాటితో వెళ్లినవాడే సక్సెస్ అవుతాడు. లేదంటే కనుమరుగైపోతాడు. ఒకప్పుడు దేశంలో 90శాతం మార్కెట్ వాటా ఉన్న ‘నోకియా’ ఫోన్లు.. స్మార్ట్ ఫోన్లుగా మారక పాత పంథాలో వెళ్లడంతో ఇప్పుడా కంపెనీయే లేకుండా పోయిన పరిస్థితి మనం చూడవచ్చు. ఇప్పుడు సినిమాలకు అదే గతి పట్టింది..

*సినీ పరిశ్రమను మార్చబోతున్న ‘కరోనా’

కరోనా వైరస్ ఇప్పుడు సినీ పరిశ్రమకు వేల కోట్ల నష్టం తెచ్చింది. భవిష్యత్ ను అంధకారం చేసింది. కరోనా తగ్గినా జనాలు థియేటర్స్ కు వచ్చి సినిమాలు చూసే అవకాశాలు కనిపించడం లేదు. అందుకే ఇక భారీగా కోట్లు పెట్టి సినిమాలు తీసే బడా నిర్మాతల వైఖరిల్లో కూడా స్పష్టమైన మార్పు వస్తోంది. టాలీవుడ్ సహా బాలీవుడ్ బడా నిర్మాతలంతా ఇప్పుడు వెబ్ సిరీస్, ఓటీటీ ఫ్టాట్ ఫామ్ ద్వారానే తమ సినిమాలు - వెబ్ సిరీస్ లను విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు.

*లాక్ డౌన్ లో ఓటీటీలే దిక్కు

లాక్ డౌన్ తో జనాలు ఇళ్లకే పరిమితం అయ్యారు. వారంతా ఇంటిల్లిపాది ఇప్పుడు ఓటీటీ ఫ్టాట్ ఫామ్ పై కొత్త సినిమాలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. దానికి అడిక్ట్ అయిపోతున్నారు. దీంతో భవిష్యత్ లోనూ థియేటర్స్ స్థానాన్ని ఓటీటీ ఫ్టాట్ ఫామ్స్ భర్తీ చేస్తాయని బడా నిర్మాతలు నమ్ముతున్నారు. అందుకే వెబ్ సిరీస్ లపై పడుతున్నారు. సినిమాలను ఓటీటీ వేదికగా రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు.

*ఇప్పటికే వెబ్ సిరీస్ లకు డిమాండ్

తెలుగుతోపాటు ప్రపంచవ్యాప్తంగా వెబ్ సిరీస్ లకు విపరీతమైన డిమాండ్ వస్తోంది. నెట్ ఫ్లిక్స్, అమేజాన్ ప్రైమ్ లు కథ, కథనం బాగుండాలే కానీ కోట్లు పెట్టి కొంటున్నారు. ఇది నిర్మాతలకు బాగానే గిట్టు బాటు చేస్తోంది. ఇప్పటికే శరత్ మరార్, వైజయింతీ మూవీస్ , ఫస్ట్ ఫ్రేమ్, డీవీవీ దానయ్య, భోగవల్లి ప్రసాద్ అలాంటి భారీ నిర్మాణ సంస్థలు కూడా వెబ్ సిరీస్ లపై దృష్టి పెట్టడం మారుతున్న సినీ జనాల దృష్టికోణానికి నిదర్శనంగా చెప్పవచ్చు.

*సినిమాకు పడే కష్టం వెబ్ సిరీస్ కు ఈజీ

సినిమాల కంటే వెబ్ సిరీస్ కు పడే కష్టం తక్కువ. దీనికి థియేటర్స్ - అగ్రిమెంట్లు - డిస్టిబ్యూటర్స్ - షేర్లు ఉండవు. డైరెక్ట్ గా అమేజాన్ ప్రైమ్ సహా దేనికైనా కోట్లకు అమ్ముకొని లాభపడవచ్చు. కరోనా టైంలో థియేటర్స్ కు జనాలు వచ్చేపరిస్థితి లేకపోవడంతో భవిష్యత్ అంతా ఓటీటీ ఫ్టాట్ ఫామ్స్ ద్వారానే సినిమాలు రిలీజ్ అవుతాయని భావిస్తున్నారు. పైగా అమేజాన్ - నెట్ ఫ్లిక్స్ లాంటి భారీ సంస్థలు కోట్లు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉంటాయి. అందుకే సినిమాల కంటే వెబ్ సిరీస్ లు బెటర్ అని నిర్మాతలు భావిస్తున్నారు. తీసిన సినిమాలను వీటి ద్వారానే రిలీజ్ కు ప్లాన్ చేస్తున్నారు. ఈ పరిణామం సినిమా ఇండస్ట్రీలో ఒక గొప్ప మార్పునకు నాంది పలుకుతుందని చెప్పవచ్చు.