Begin typing your search above and press return to search.

అసెంబ్లీ సెట్ రెడీ అయ్యిదండీ!!

By:  Tupaki Desk   |   31 Aug 2017 9:58 AM IST
అసెంబ్లీ సెట్ రెడీ అయ్యిదండీ!!
X
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కమర్షియల్ హీరోగా మారక ప్రయోగాలు చేస్తూనే కథలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఒక్క ఫెయిల్యూర్ వచ్చినా మహేష్ తట్టుకోలేడన్న విషయం తెలిసిందే. ఇక అందుకే హిట్ ఇచ్చిన దర్శకుడైనా సరే పూర్తి కథ విన్నాకే షూటింగ్ స్టార్ట్ చేస్తున్నాడట. ఇక కొరటాల శివ దర్శకత్వంలో శ్రీమంతుడు తీసి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్న మహేష్ మరోసారి అతడి దర్శకత్వంలో లోనే భారత్ అనే నేను సినిమాను తెరకెక్కిస్తున్నాడు.

పూర్తిగా పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ ఒక రాజకీయ నాయకుడిగా కనిపించబోతున్నాడు. కొన్ని రోజుల క్రితమే షూటింగ్ స్టార్ట్ చేసిన మహేష్ మరి కొన్ని రోజుల్లో కొత్తగా ఏర్పాటు చేస్తున్న భారీ అసెబ్లీ సెట్ లో నిర్విరామంగా నెల రోజుల పాటు షూటింగ్ చేస్తాడట. ప్రస్తుతం స్పైడర్ చివరి పాట చిత్రీకరణ లో భాగంగా మన హీరో విదేశాల్లో ఉన్నాడు. అక్కడి నుంచి రాగానే కొరటలతో కలిసి అసెంబ్లీలో జరిగే కొన్ని రాజకీయ పరమైన సన్నివేశాలతో షూటింగ్ ను కంటిన్యూ చేయనున్నాడు. అయితే మహేష్ సెట్స్ లో నటించడం కొత్తేమి కాదు. ఇంతకుముందు మహేష్ సినిమాల్లో వేసిన కొన్ని సెట్స్ చాలా పాపులర్ అయ్యాయి. ముఖ్యంగా తను మొదటి ఇండస్ట్రీ హిట్ అందుకున్న ఒక్కడు సినిమాలో చార్మినార్ సెట్ అందరిని ఆకట్టుకుంది. గుణశేఖర్ ఆ చిత్రానికి దర్శకత్వం వహించాడు. ఇక అదే దర్శకుడి తెరకెక్కించిన "అర్జున్" సినిమాలో మధుర మీనాక్షి టెంపుల్ సెట్ కూడా సినిమాలో అందంగా కనిపించింది. సినిమా పర్లేదు అనిపించినా సెట్స్ కి మాత్రం ప్రేక్షకులు ఫిదా అయ్యారు.

ఇప్పుడు మళ్లీ ఆ స్థాయిలో భారత్ అనే నేను సినిమాలో "అసెంబ్లీ" సెట్ లో మహేష్ కనిపించనున్నాడు. అంతే కాకుండా ఈ సినిమాలో మహేష్ లుక్ చాలా కొత్తగా ఉంటుందట. చాలా సీన్స్ లో కద్దర్ దుస్తులతో కనిపించనున్నాడని తెలుస్తోంది. మొత్తానికి మళ్లీ మరో భారీ సెట్ లో మెరవనున్నాడు ఈ సూపర్ స్టార్. చూడాలి మరి ఆ సెట్ ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుందో..