Begin typing your search above and press return to search.

తమిళ స్టార్‌ హీరో సినిమాకు తెలుగులో బంపర్‌ ఆఫర్‌

By:  Tupaki Desk   |   27 Dec 2020 3:30 PM GMT
తమిళ స్టార్‌ హీరో సినిమాకు తెలుగులో బంపర్‌ ఆఫర్‌
X
తమిల స్టార్‌ హీరో అజిత్‌ ప్రస్తుతం 'వాలిమై' సినిమాను చేస్తున్నాడు. ఈ సినిమాలో ఎక్కువ శాతం షూటింగ్‌ ను హైదరాబాద్‌ లో చేయడం జరిగింది. ఈ సినిమా పై తెలుగు ప్రేక్షకుల్లో మరియు ఇండస్ట్రీ వర్గాల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. కనుక తెలుగులో ఈ సినిమాను డబ్బింగ్ చేసేందుకు ప్రముఖ నిర్మాతలు పోటీ పడ్డట్లుగా సమాచారం అందుతోంది. మీడియా వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ప్రముఖ నిర్మాణ సంస్థ ఈ ఈసినిమా డబ్బింగ్‌ రైట్స్‌ ను ఏకంగా రూ.10 కోట్లకు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది.

అజిత్‌ గత సినిమాల్లో కొన్ని తెలుగులో ఆడిన సందర్బాలు ఉన్నాయి. కనుక ఈ సినిమాను భారీ మొత్తంకు కొనుగోలు చేసినట్లుగా తెలుస్తోంది. తెలుగులో ఈ సినిమాను అదే టైటిల్‌ తో విడుదల చేస్తారా లేదా మరో టైటిల్‌ తో విడుదల చేస్తారా అనేది చూడాలి. అజిత్ హీరోగా రూపొందుతున్న ఈ సినిమాకు తమిళ స్టార్‌ డైరెక్టర్‌ హెచ్‌ వినోధ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. బోణీ కపూర్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో తెలుగు నటుడు విలన్‌ గా కనిపించబోతున్నాడు. ఆకారణంగా కూడా తెలుగులో ఈ సినిమాపై క్రేజ్ ఉంది. మొత్తానికి ఈ సినిమా తెలుగులో భారీ బిజినెస్‌ చేయడంతో వసూళ్లు ఎలా ఉంటాయా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.