Begin typing your search above and press return to search.
RRRలో భారీ యాక్షన్ సీన్.. గూస్ బమ్స్ అవ్వాల్సిందేనట
By: Tupaki Desk | 17 Dec 2020 11:13 AM ISTచాలా సినిమాలు క్లైమాక్స్ ఫినిష్ అవ్వకుండానే థియేటర్ నుంచి వెళ్లిపోతుంటారు ప్రేక్షకులు. కానీ.. రాజమౌళి సినిమా విషయంలో అలా కాదు. ఎండ్ కార్డ్ మీదకు ఓ స్టాంప్ దూసుకొస్తుంది ‘ఆన్ ఎస్ఎస్ రాాజమౌళి ఫిల్మ్’ అని. అది చూసి కానీ అడుగు బయటపెట్టరు ఆడియన్స్. అదీ.. ఆయన క్రేజ్. ఆయన చిత్రాలను చెక్కే విధానం అలా ఉంటుంది మరి. కథ, కథనంతోపాటు ప్రతీ పాత్ర, ప్రతీ సీన్ పర్ఫెక్ట్ గా ఉండాలని తపిస్తుంటాడు ఈ దర్శక ధీరుడు. ఇక, ఆయన సినిమాల్లో యాక్షన్ సీన్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒళ్లు గగుర్పొడిచే పోరాట సన్నివేశాలు ప్రేక్షకులను మునివేళ్లపై నిలబెడుతుంటాయి. సింహాద్రి నుంచి బాహుబలి దాకా.. ఏ సినిమా చూసినా ట్రేడ్ మార్క్ ఫైట్లు కనిపిస్తాయి. ఆ ట్రెండ్ ను కొనసాగించేలాా ‘RRR’లో కూడా హెవీ యాక్షన్ సీన్ ఒకటి షూట్ చేయనున్నారు.
150 రోజుల శిక్షణ..
రోమాంచితంగా ఉండే ఈ పోరాట సన్నివేశం కోసం భారీ సంఖ్యలో ఫైటర్లను తీసుకొచ్చారట. వీరికి 150 రోజుల పాటు ట్రైనింగ్ ఇస్తున్నారట. ప్రముఖ స్టంట్ కొరియోగ్రాఫర్ సోలొమన్ రాజు వీరికి నేతృత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఆయన కొన్ని స్టంట్స్ డిజైన్ చేసి పెట్టారట. వాటిలో కొన్నింటిని రాజమౌళి ఫైనల్ చేసి రానున్న కొత్త షెడ్యూల్లో చిత్రీకరించనున్నారు.
సినిమాలో భారీ ఫైట్ ఇదే..
సినిమా మొత్తంలో భారీ యాక్షన్ సన్నివేశం ఇదేనని టాక్. దీని కోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయనున్నారు. ఈ చిత్రంలో చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రల్లో కనిపించనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన రెండు టీజర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. దీంతో ఈ చిత్రంపై అంచనాలు భారీగా పెరిగాయి. దాదాపు రూ. 400 కోట్ల వ్యయంతో ప్రముఖ నిర్మాత డివివి దానయ్య ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది దసరాా కానుకగా ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తేనున్నారని సమాచారం.