Begin typing your search above and press return to search.
ఆ నటుడి చేష్టలకు చితక్కొడుతున్న జనం!
By: Tupaki Desk | 2 Sept 2019 3:45 PM ISTఒక నటుడు రోడ్డు మీదకు వస్తే.. అభిమానంతో అతడి చుట్టూ చేరటం.. సెల్పీల హడావుడి చేయటం.. తమ అభిమానాన్ని ప్రదర్శించటం చేస్తుంటారు. కానీ.. ఇందుకు భిన్నమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నారు కన్నడ నటుడు కమ్ బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ హుచ్చ వెంకట్. ఆయన తీరుతో జనం ఆయన్ను చితక్కొట్టేస్తున్నారు. ఇందులో జనం తప్పు కంటే కూడా హుచ్చ వెంకట్ తప్పే ఎక్కువన్న మాట వినిపిస్తోంది.
రెండు రోజుల క్రితం కర్ణాటకలోని మండ్య సిటీలో ఒక హోటల్ కు వచ్చిన అతగాడు.. హోటల్ ఎదుట ఉన్న కార్ల అద్దాల్ని పగలకొట్టాడు. దీంతో.. ఆ కారు యజమాని తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. అతడి మీద దాడి చేశాడు. ఈ గొడవ గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు వచ్చి.. అతడ్ని తమతో తీసుకెళ్లారు.
తప్పుడు పని చేసిన హుచ్చ వెంకట్ ను జనం చితక్కొడుతున్న వీడియో వైరల్ గా మారింది. సోషల్ మీడియాలో అతడి చేష్టలు.. అతడ్నిజనం కొట్టిన వీడియోను అదే పనిగా చూస్తూ.. చర్చించుకుంటున్నారు. వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలవటమే కాదు.. తన వింత చేష్టలతో ఎక్కడో కాలేలా చేసే తీరు ఆయనకు ఎక్కువే.
గతంలోనూ హుచ్చ వెంకట్ తన వింత చేష్టలతో ఇలాంటి తీరునే ప్రదర్శించారని చెబుతారు. తాగిన మైకంలో బేకరీకి వెళ్లి.. అక్కడి వారిని కాలితో తన్నటం.. బేకరి యజమానిపై దాడి చేయటంతో పాటు.. ఒక టీవీ డిబేట్ లో ఒక డైరెక్టర్ మీదా దాడి చేసిన వివాదం అతడి మీద ఉంది. నటి దివ్య స్పందనను పెళ్లి చేసుకుంటానంటూ వేధింపులకు గురి చేసిన ఆరోపణ మీదా కేసు ఉంది. కేసుల మీద కేసులు.. వింత చేష్టలతో జనం చేత కొట్టించుకుంటున్న సదరు నటుడు.. ఎందుకిలా? చేస్తున్నట్లు అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.