Begin typing your search above and press return to search.
తాజా కలకలం: నటుడి ఆత్మహత్యాయత్నం
By: Tupaki Desk | 19 Jun 2017 11:08 AM ISTశాండిల్ వుడ్ కు చెందిన నటుడు ఒకరు సూసైడ్ అటెంప్ట్ చేసిన వైనం షాకింగ్ గా మారింది. పినాయిల్ తాగిన అతను.. తాను సూసైడ్ చేసుకున్నట్లుగా స్నేహితులకు.. మీడియాకు చెప్పుకున్నారు. దీంతో స్పందించిన స్నేహితులు సదరు నటుడ్ని ఆసుపత్రికి తరలించి.. వైద్య చికిత్సలు చేస్తున్నారు. ఇంతకీ ఆ నటుడు ఎవరు? ఎందుకు సూసైడ్ అటెంప్ట్ చేశారన్నది చూస్తే..
కన్నడ సినిమాల్లో నటిస్తుంటాడు హుచ్చ వెంకట్. ఇతగాడి తాజా చిత్రం పోకిరీ. నెల క్రితం విడుదలైన ఈ చిత్రం అట్టర్ ప్లాప్ అయ్యింది. ఇదిలా ఉండగా ఆదివారం ఫినాయిల్ తాగి... స్నేహితులకు ఫోన్ చేసి తాను సూసైడ్ అటెంప్ట్ చేసినట్లుగా చెప్పారు. లవ్ ఫెయిల్ కావటంతోనే తానీ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా ఫ్రెండ్స్ కు చెప్పాడు. దీంతో.. అతన్ని ఆసుపత్రికి తరలించారు. వెంకట్ ప్రేమించింది ఒక సినీ నటినని.. ఆమెకు తానంటే ఇష్టమేనని.. కాకుంటే నటి తల్లిదండ్రులకు తాను ఇష్టం లేదని.. దీంతో తమ ప్రేమ విఫలమైందని పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే.. సూసైడ్ అటెంప్ట్ చేసిన వెంకట్ ను ఆసుపత్రికి తరలించగా.. వైద్యం చేస్తున్న వైద్యులపై సదరు నటుడు విరుచుకుపడటమే కాదు రచ్చ రచ్చ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రచార యావతోనే.. వెంకట్ ఇలా వ్యవహరించారన్న విమర్శ వినిపిస్తోంది. ఫినాయిల్ తాగి.. సూసైడ్ అటెంప్ట్ చేసినట్లుగా స్నేహితులకే కాదు మీడియాకుకూడా సమాచారం ఇవ్వటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/