Begin typing your search above and press return to search.

సంచ‌ల‌నంగా హీరోయిన్ తో న‌టుడి ల‌వ్ మ్యారేజ్‌

By:  Tupaki Desk   |   14 May 2018 5:22 AM GMT
సంచ‌ల‌నంగా హీరోయిన్ తో న‌టుడి ల‌వ్ మ్యారేజ్‌
X
ఒక సినీ న‌టుడు.. ఒక హీరోయిన్ పెళ్లాడితే బోలెడంత సంద‌డి ఉంటుంది. ఆ పెళ్లి గురించి మీడియాలో భారీ క‌వ‌రేజ్ ఉంటుంది. సినీ ప్ర‌ముఖులు.. రాజ‌కీయ ప్ర‌ముఖుల మొద‌లు చాలానే మందే ఆ పెళ్లికి వెళ్లేందుకు ఆస‌క్తి క‌న‌ప‌రుస్తారు. మొత్తంగా హంగామా.. హంగామాగా ఉంటుంది వ్య‌వ‌హారం.

దీనికి భిన్నంగా మారింది శాండిల్ వుడ్‌ కు చెందిన ఒక హీరోయిన్ పెళ్లి వ్య‌వ‌హారం. న‌టుడ్ని పెళ్లాడిన హీరోయిన్ ఉదంతం హాట్ టాపిక్ గా మార‌ట‌మే కాదు.. హీరోయిన్ త‌ల్లి నుంచి తీవ్ర నిర‌స‌న వ్య‌క్తం కావ‌టం ఇప్పుడో ఇష్యూగా మారింది. శాండ‌వుల్ కు చెందిన న‌టుడు హుచ్చ వెంక‌ట్‌. ఆయ‌న‌.. డిక్టేట‌ర్ హుచ్చ వెంక‌ట్ అనే సినిమాలో హీరోయిన్ గా న‌టిస్తున్న ఐశ్వ‌ర్య‌ను తాజాగా పెళ్లాడారు.

వీరి పెళ్లి వారం క్రిత‌మే జ‌రిగినా.. తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. ర‌హ‌స్యంగా సాగిన వీరి పెళ్లి.. ఎంత సింఫుల్ గా జ‌రిగిందంటే.. మెడ‌లో పసుపుకొమ్ముతో కూడిన తాడుతో క‌ట్టి.. దండ‌లు మార్చుకున్న‌ట్లుగా చెబుతున్నారు. త‌ల‌కావేరి వ‌ద్ద వీరి పెళ్లి చాలా సింఫుల్ గా జ‌రిగిన‌ట్లుగా తెలుస్తోంది.

వీరిద్ద‌రూ దంప‌తులైన విష‌యం తాజాగా బ‌య‌ట‌కు వ‌చ్చింది. త‌న‌దైన న‌ట‌న‌తో..హావ‌భావాల‌తో అభిమానుల్ని సంపాదించుకున్న వెంక‌ట్ గ‌డిచిన కొంత‌కాలంగా హీరోయిన్ ఐశ్వ‌ర్య‌తో ప్రేమ‌లో ఉన్నారు. తాజాగా ఫేస్ బుక్ లైవ్ లోకి వ‌చ్చిన వెంక‌ట‌ల్‌.. ఇంట్లో వారికి తెలీకుండా పెళ్లి చేసుకున్న‌ట్లు చెప్పి.. త‌మ‌ను క్ష‌మించి అంద‌రిలో ఒక‌డిగా చూడాల‌ని కోరారు.

ఇదిలాఉంటే.. వెంక‌ట్ పెళ్లి వ్య‌వ‌హారాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌డుతున్నారు ఐశ్వ‌ర్య త‌ల్లి రూప‌. వారి పెళ్లిని తాను ఒప్పుకోవ‌టం లేద‌ని.. మూడు రోజులుగా ఐశ్వ‌ర్య త‌న‌కు ఫోన్లో దొర‌క‌టం లేద‌న్నారు. వెంక‌ట్.. ఐశ్వ‌ర్య‌లు చెన్నైలో ఉంటున్న‌ట్లుగా చెప్పిన ఆమె.. పెళ్లి చేసుకున్న విష‌యం తెలిసినప్ప‌టి నుంచి వెంక‌ట్ పై పోలీసుల‌కు కంప్లైంట్ చేయాలంటే కూడా భ‌యంగా ఉంద‌న్నారు. త‌న‌ను హుచ్చ వెంక‌ట్ హ‌త్య చేస్తాడ‌న్న భ‌యం ఉన్న‌ట్లుగా ఆమె చేసిన వ్యాఖ్య‌లు ఇప్పుడు సంచ‌ల‌నంగా మారాయి.