Begin typing your search above and press return to search.

పిల్లలకు ప్రేమతో.. హృతిక్ రోషన్

By:  Tupaki Desk   |   11 Dec 2016 9:00 AM IST
పిల్లలకు ప్రేమతో.. హృతిక్ రోషన్
X
పిల్లలంటే ఎంతసేపు మమ్మీ మమ్మీ అంటూ అమ్మల వెనకలే తిరుగుతారు. నాన్నలతో ఎంత ఎంజాయ్ చేసినా అమ్మతో ఉండే ఎఫెక్షనే వేరు అందుకే చిన్నపిల్లలు ఎప్పుడూ చూసినా అమ్మల దగ్గరే కనిపిస్తుంటారు. సెలబ్రిటీ కిడ్స్ కూడా దీనికి మినహాయింపు కాదు. అయితే బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్ పిల్లలు మాత్రం ఈ జాబితాలో ఉండరు. అమ్మ సుజానే కన్నా నాన్న దగ్గరే ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు.

తన పిల్లలతో ఎంజాయ్ చేసిన జాయ్ ఫుల్ మూమెంట్స్ ని దుగ్గూ కూడా అప్పుడప్పుడు అభిమానులతో షేర్ చేసుకుంటుంటాడు. అలా షేర్ చేసుకొన్న ఓ ఎడొరబుల్ పిక్ ఒకటి ఇప్పుడు నెటిజన్స్ కి విపరీతంగా నచ్చేసింది. తన కొడుక్కి ప్రేమతో పెదాలపై ముద్దు పెడ్తోన్న హృతిక్ ఫోటోని చూడటానికి రెండు కళ్లు చాలావంటే నమ్మాల్సిందే. హృతిక్ స్టార్ హీరోనే.. స్ర్కీన్ మీద ఎన్ని ఫైట్సైనా చేస్తాడు.. ఇంకెన్ని మ్యాజిక్సైనా చూపిస్తాడు.. కానీ పిల్లలు పక్కనున్నప్పుడు వారితో సరదాగా గడుపుతున్నప్పుడు ఆ మోములో కనిపించే ఆనందం మాత్రం ఇంకెక్కడా కనబడదు. నాన్న వాత్సాల్యం ఎలాగుంటుందో చెప్పడానికి ఈ ఫోటో చాలు.

షూటింగ్సంటూ ఎంత బిజీగా ఉన్నా సరే కొడుకులు హిరాన్.. హ్రిదాన్ తో కలిసి టూర్స్.. ట్రిప్స్ వేయడం హృతిక్ కి బాగా అలవాటు. ఇక భార్య సుజానే నుంచి విడిపోయినప్పటికీ ఆ ప్రభావం తన చిన్నారుల మీద పడకుండా ఇంకా కేర్ ఫుల్ గా ఉంటున్నాడు. వీలైనంత ఎక్కువగా వాళ్లతోనే గడుపుతున్నాడు. బహుశా అందుకేనేమో హృతిక్ పిల్లలు కూడా అమ్మ కన్నా నాన్న దగ్గరే ఎక్కువగా కనిపిస్తుంటారు.