Begin typing your search above and press return to search.

బాలీవుడ్ సూపర్ హీరో క్రేజీ లైనప్..!

By:  Tupaki Desk   |   24 Jun 2021 4:00 PM IST
బాలీవుడ్ సూపర్ హీరో క్రేజీ లైనప్..!
X
బాలీవుడ్ సూపర్ హీరో హృతిక్ రోషన్.. గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకమైన ఇంట్రడక్షన్ అవసరం లేదు. అందులోనూ తెలుగు ప్రేక్షకులకు హృతిక్.. క్రిష్ గా బాగా పరిచయం. హృతిక్ తెరపై కనిపించి దాదాపు రెండేళ్లు పూర్తవుతుంది. తదుపరి సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అయితే ఈసారి హృతిక్ భారీ సినిమాలే లైనప్ చేసుకున్నాడు. సాధారణంగా హృతిక్ మూవీస్ అప్పుడప్పుడు తెలుగులో కూడా డబ్ వెర్షన్ లో రిలీజ్ అవుతుంటాయి. కానీ క్రిష్ సినిమాతో హృతిక్ తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. ఇప్పటికే ఇండియన్ సూపర్ మ్యాన్ అంటే క్రిష్ సిరీస్ మాత్రమే.

అయితే ఫిట్నెస్ కు ఐకాన్ లా కనిపిస్తుంటాడు హృతిక్. ఫిట్నెస్ తో పాటు హృతిక్.. డాన్స్ కూడా అద్భుతంగా చేస్తాడనే విషయం అందరికి తెలిసిందే. హృతిక్ ఏ సినిమాలో నటించినా మినిమం డాన్స్ స్పెషల్ గా హైలైట్ అవుతుంది. అయితే హృతిక్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టీవ్. ఎప్పటికప్పుడు తనకు సంబంధించి విషయాలు ఫ్యాన్స్ తో షేర్ చేసుకుంటాడు. ప్రస్తుతం హృతిక్ సినిమాల గురించి ఇండస్ట్రీ వర్గాలలో చర్చలు జరుగుతున్నాయి. ఈ స్టార్ హీరో చేతిలో ప్రెసెంట్ నాలుగు బిగ్ ప్రాజెక్ట్స్ ఉన్నట్లు తెలుస్తుంది. అందులో ఒకటి క్రిష్ సిరీస్ లో క్రిష్-4 కూడా ఉంది.

అయితే ప్రస్తుతం వార్ సినిమా సీక్వెల్లో కూడా నటిస్తున్నాడు. అలాగే యాక్షన్ మూవీస్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వంలో ఫైటర్ మూవీ చేస్తున్నాడు. ఫస్ట్ టైం దీపికా పదుకొనే హృతిక్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉండగా.. ఈ సినిమాల అనంతరం హృతిక్ తమిళ సూపర్ హిట్ రీమేక్ మూవీలో నటించనున్నాడు. మాధవన్ - విజయ్ సేతుపతి కాంబినేషన్ లో తెరకెక్కిన 'విక్రమ్ వేద' సినిమాలో కనిపించనున్నాడు. ఈ బాలీవుడ్ రీమేక్ సినిమాకు కూడా ఒరిజినల్ డైరెక్టర్స్ పుష్కర్, గాయత్రి దర్శకత్వం వహించనున్నారు. అంతేగాక కొంతకాలంగా హృతిక్ ఈ సినిమాకోసం వర్కౌట్స్ ప్రారంభించాడని తెలుస్తుంది. అసలు విషయం ఏంటంటే.. హృతిక్ కెరీర్లో ఇది 25వ సినిమా కావడం విశేషం. మొత్తానికి భారీ లైనప్ సెట్ చేసుకున్నాడు ఈ యాక్షన్ హీరో.