Begin typing your search above and press return to search.
మీటూ ఎఫెక్ట్ తో సూపర్ 30 విడుదల వాయిదా?
By: Tupaki Desk | 29 Oct 2018 12:11 PM ISTబాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ ప్రస్తుతం 'సూపర్ 30' అనే సినిమాలో నటిస్తున్నాడు. విద్యావేత్త.. గణిత మేథావి అయిన ఆనంద్ కుమార్ బయోపిక్ ఇది. ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న వికాస్ బల్ పై #మీటూ కాంపెయిన్ లో భాగంగా లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో 'సూపర్ 30' నిర్మాతలు వికాస్ ను దర్శకత్వ బాధ్యతలనుండి తప్పించారు.
ఈ సినిమాకు సంబంధించిన అధిక భాగం షూటింగ్ ఇప్పటికే పూర్తయిందటగానీ పెండింగ్ పోర్షన్లను మాత్రం చిత్రీకరించాల్సి ఉంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ ఇంకా మొదలుపెట్టలేదు. దీంతో ఈ సినిమాను ముందుగా అనుకున్న సమయానికి కంప్లీట్ చేస్తారా లేదా అనే విషయంలో అనుమానాలు నెలకొన్నాయి. నిర్మాతలు జనవరి 24 న రిలీజ్ చేస్తామని ఎప్పుడో ప్రకటించారు. దీంతో ఆ డెడ్ లైన్ ను చేరుకోవడం కష్టమని.. ఈ సినిమా విడుదల ను వాయిదా వేస్తారని బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
నిర్మాతలయిన అనురాగ్ కశ్యప్.. విక్రమాదిత్య మోత్వానేలు ఈ సినిమాను కంప్లీట్ చేసేందుకు కొత్త డైరెక్టర్ ను వెతుకుతున్నారట. అప్పటి వరకూ సినిమాకు సంబంధించిన పనులన్నీ ఆగినట్టే. ఏదేమైనా #మీటూ కాంపెయిన్ ఎఫెక్ట్ పెద్ద స్టార్ హీరో సినిమా విడుదల పై పడడం ఒక సీరియస్ పరిణామమే. ఇక ఫ్యూచర్ లో ఇలాంటివి ఎన్ని జరుగుతాయో?