Begin typing your search above and press return to search.

ష‌ర్ట్ లెస్ హృతిక్ కి మాజీ భార్య కాంప్లిమెంట్‌

By:  Tupaki Desk   |   29 Jun 2021 3:30 AM GMT
ష‌ర్ట్ లెస్ హృతిక్ కి మాజీ భార్య కాంప్లిమెంట్‌
X
కండ‌ల హీరో హృతిక్ రోష‌న్ కి ష‌ర్ట్ విప్పి యాబ్స్ చూపించ‌డం కండ‌రాల్ని పొంగించ‌డం కొత్తేమీ కాదు కానీ.. మునుప‌టిలా కాకుండా ఈసారి అత‌డు ష‌ర్ట్ విప్ప‌డం మాత్రం సంథింగ్ హాట్ అనే చెప్పాలి. ఇంత‌కుముందు వార్ చిత్రంలో హృతిక్ - టైగ‌ర్ ఇద్ద‌రూ గురుశిష్యులుగా క‌నిపించ‌డ‌మే కాదు.. ష‌ర్ట్ విప్పి వార్ కి దిగే స‌న్నివేశాలు న‌భూతో అన్న చందంగా ర‌క్తి క‌ట్టించాయి.

తాజాగా హృతిక్ ష‌ర్ట్ లెస్ ఫోజుని ఇన్ స్టాలో షేర్ చేయ‌గా దానికి మాజీ భార్య సుశానే ఖాన్ స‌హా టైగ‌ర్ ష్రాఫ్‌.. అనీల్ క‌పూర్ త‌దిత‌రులు స్పందించారు. హృతిక్ రోషన్ బేర్ ఛాతీ టోన్డ్ ఫిట్ లుక్ కి ఫిదా అయిపోయారంతా. రిఫ్లెక్టివ్ సన్ గ్లాసెస్ .. బ్లాక్ క్యాప్ ధరించి స్ట‌న్న‌ర్ లుక్ తో హృతిక్ వేడి పెంచాడు. హృతిక్ రోషన్ సిజ్లింగ్ లుక్ పై మాజీ భార్య సుశానే ఖాన్ `యు లుక్ 21` అంటూ కితాబిచ్చేశారు. వార్ సహనటుడు టైగర్ ష్రాఫ్ `బాప్` అని వ్యాఖ్యానించారు. ఆర్ మాధవన్- అభిషేక్ బచ్చన్ - నుష్రత్ భారుచా హృతిక్ లుక్ పై ప్ర‌శంస‌లు కురిపించారు. నిరంతరం బార్ పెంచడం నీవ‌ల్ల‌నే అంటూ అనీల్ క‌పూర్ ప్ర‌శంసించారు. ఆర్ మాధవన్ హృతిక్ ను ఒక లెజెండ్ అని పొగిడేశారు.

హృతిక్ న‌టించిన బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ క్రిష్ గ‌త ఏడాదితో 15 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సంగ‌తి తెలిసిందే. క్రిష్ 4 ని ప్ర‌క‌టించి చిత్రీక‌ర‌ణ‌కు స‌న్నాహ‌కాల్లో ఉన్నారు. విక్ర‌మ్ వేద‌ రీమేక్ లోనూ హృతిక్ న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి పుష్కర్- గాయత్రి ద్వ‌యం దర్శకత్వం వహించనున్నారు.