Begin typing your search above and press return to search.
హృతిక్ టేస్ట్ కి ఈ ఇల్లు ఒక నిదర్శనం!
By: Tupaki Desk | 5 Aug 2016 2:09 PM ISTమొన్నటివరకూ షారూఖ్ ఖాన్ మన్నత్ - అమితాబ్ బచ్చన్ జల్సా ల గురించి అభిమానులు తెగ చర్చించుకున్నారు.. ఆహో ఓహో అని సంబరపడిపోయినవారు కొందరైతే.. అసూయ చెందినవారు మరికొందరు. వీరి సంగతి అలా ఉంటే.. తర్వాతి కాలంలో వీరి ఇంద్రభవనాలను తలదన్నేలా ఒక హీరోయిన్ ఇల్లు కూడా వెలుగులోకి వచ్చింది. అదే.. బాలీవుడ్ మాజీ హీరోయిన్ శిల్పాశెట్టి భవంతి. ఇంత అందమైన శిల్పాశెట్టి ఇల్లు కిన్నర ని చూసిన వారు ఓ డ్రీమ్ ప్లేస్ గా కూడా ఆ ఇంటిని అభివర్ణిస్తూంటారు. ఇదే క్రమంలో దుబాయి లో అభిషేఖ్ బచ్చన్ - ఐశ్వర్యలు కట్టుకున్న విల్లా తాజాగా వార్తల్లో నిలిచింది. ఇలా తారల గృహాల గురించి చెప్పుకూంటూ పోతే అవి ఇల్లా లేక ఇంద్ర లోకానికి చెందిన భవనాలా అనిపించక మానదు. సెలబ్రెటీలు ఉండే ఇళ్లు అంటే వారిని అభిమానించేవారికీ, సామాన్యులకు కూడా చాలా ఆసక్తే. ఈ క్రమంలో తాజాగా చాలామంది ఈర్ష్య పడే స్థాయిలో వెలుగుచూసింది హృతిక్ రోషన్ ఇల్లు. చూసినవారికి కాస్తంత ఆనందాన్ని, అత్యధికంగా ఆశ్చర్యాన్ని కొద్దిపాటి ఈర్ష్యని కలిగించేదిగా ఉండటమే హృతిక్ రోషన్ ఇంటి ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.
హృతిక్ ఇంటినిండా అందంగా డెకరేట్ చేసిన ఎన్నో అద్భుతాలు దాగిఉన్నాయి. తన టేస్ట్ కి తగ్గట్లు ఏర్పాటుచేసుకున్న ఇంటీరియర్ డెకరేషన్ చూసి హృతిక్ ని అభినందించకుండా ఉండటం కష్టమే సుమీ. ఈ ఇంటిలోకి ప్రవేశించగానే కనిపించే వెయిటింగ్ హాల్ తో మొదలైన ఈ సుందర భవనం సొగసులు.. లోపలికి వెళ్లేకొద్దీ ఆశ్చర్యాలనే కలిగిస్తాయి. హృతిక్ ప్రత్యేకంగా డిజైన్ చేయించుకున్న ఒక వాల్ నిండా తన ఫోటోగ్రాఫ్స్ తో నింపేశాడు.. ఇది కచ్చితంగా ప్రత్యేకమైందే. ఇక పుస్తకాలు చదవటంలో ఆసక్తిని కనబరిచే హృతిక్.. దీనికోసం ప్రత్యేకంగా ఒక గదిని ఏర్పరచుకున్నాడు. అంటే.. ఇది హృతిక్ పర్సనల్ లైబ్రరీ అన్నమాట. అనంతరం.. పిల్లలతో ఆడుకొవడానికి ఒక కిడ్స్ స్పెషల్ రూం - డైనింగ్ రూం - ఇలా ఆ ఇంటిలోని ప్రతీ అడుగూ.. హృతిక్ టేస్ట్ ని చెప్పకనే చెబుతుంది అనడంలో ఆశ్చర్యంలేదు. ఇదే సమయంలో ఇంట్లో పెట్టిన రకరకాల డెకరేషన్ ఐటంస్ ను హృతిక్ రకరకాల దేశాల నుంచి తెప్పించారు. ఈ స్థాయిలో ఉన్న ఈ ఇంటిని చూసిన అభిమానులు, తోటి సినీ జనాలు ఆశ్చర్యపోతుంటే.. సీ ఫేసింగ్ లో ఉన్న తన ఇంటిని చూసుకుని హృతిక్ కూడా మురిసిపోతుంటాడట!