Begin typing your search above and press return to search.

నాకు అతీంద్రియ శక్తులు ఉన్నాయ్! సిగరెట్ తాగను

By:  Tupaki Desk   |   28 April 2020 7:00 AM IST
నాకు అతీంద్రియ శక్తులు ఉన్నాయ్! సిగరెట్ తాగను
X
ఇండియన్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరో హృతిక్ రోష‌న్ ప్ర‌స్తుతం లాక్‌డౌన్ స‌మ‌యాన్ని త‌న పిల్ల‌ల‌తో స‌ర‌దాగా ఎంజాయ్ చేస్తున్నాడు. వీరికి తోడుగా హృతిక్ మాజీ భార్య సుశానే ఖాన్ కూడా ఆయనతో పాటే ఉంటున్నారు. రీసెంట్‌గా హృతిక్ త‌న పిల్ల‌ల‌తో క‌లిసి బాల్కనీలో ముచ్చ‌టిస్తుండ‌గా, సుశానే కెమెరాతో క్లిక్ మ‌నిపించారు. అంతేకాదు ఈ ఫోటోని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. హృతిక్ చేతిలో సిగరెట్ పట్టుకున్నట్లు కన్పిస్తున్న ఈ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ హల్చల్ చేస్తోంది. స్టార్ హీరో హృతిక్ ఇలా పిల్ల‌ల‌తో సిగరెట్ తాగుతున్నాడా లేక పిల్లలకు సిగరెట్ తాగడం నేర్పిస్తున్నాడా.. అంటూ కొంద‌రు హృతిక్ తీరుపై అభిప్రాయ పడ్డారు. అయితే ఓ నెటిజ‌న్ డైరెక్ట్‌ గా మీరు సిగ‌రెట్ తాగుతారా? అని హృతిక్‌ని ప్ర‌శ్నించారు.

దీంతో ఆ ప్రశ్నకి డైరెక్ట్‌ గా స్పందించిన హృతిక్.. నాకు సిగరెట్ స్మోకింగ్ అల‌వాటే లేదు. నేను క్రిష్‌ అంటే అతింద్రియ శ‌క్తుల‌న్న వాడిని అంటూ.. మొట్ట‌మొద‌ట వైర‌స్‌ ని నిర్మూలించి ఆ త‌ర్వాత సిగ‌రెట్‌ ని అంతం చేస్తాన‌ని త‌న ట్వీట్‌ లో పేర్కొన్నాడు. త‌న అనుమానాన్ని నివృత్తి చేసినందుకు నెటిజన్ ధ‌న్య‌వాదాలు తెలిపాడు. మిగ‌తా అభిమానులు సైతం సిగ‌రెట్ అలవాటు లేని హృతిక్‌ పై పొగ‌డ్త‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. "నీకు ఎలాంటి శ‌క్తులున్నా లేక‌పోయినా నువ్వు మాకు క్రిష్‌ వే.." అంటూ కామెంట్లతో ప్రేమ‌ను చాటుకుంటున్నారు. ఇంత‌కీ ఈ ఫొటోను హృతిక్ రోష‌న్ మాజీ భార్య సుశానే ఇన్‌ స్టాగ్రామ్‌ లో పోస్ట్ చేశారు. ఇందులో మ‌నం గ‌మ‌నిస్తే హృతిక్ చేతిలో సిగ‌రెట్ ఉన్న‌ట్టు అనిపిస్తుంది.