Begin typing your search above and press return to search.

బ‌న్నీ డాన్స్ కి హృతిక్ ఫిదా

By:  Tupaki Desk   |   4 March 2020 1:15 PM IST
బ‌న్నీ డాన్స్ కి హృతిక్ ఫిదా
X
బాలీవుడ్ సూప‌ర్ స్టార్ హృతిక్ డాన్సింగ్ గురించి చేప్పేదేముంటుంది. హృతిక్ డాన్స్ కే ప్ర‌త్యేక‌మైన అభిమానులున్నారు. అత‌నో ప్రోఫెష‌న‌ల్ డాన్స‌ర్. కొరియోగ్రాప‌ర్ల‌నే కొట్టేసే గొప్ప కంపోజ‌ర్. ఆ విష‌యంలో హృతిక్ ని ఏ బాలీవుడ్ హీరో టచ్ చేయ‌లేరు. ఇక టాలీవుడ్ స్టార్ హీరోల్లోనూ హృతిక్ డాన్సింగ్ పెర్పామెన్స్ కు అభిమానులున్నారు. బాడీని విల్లులా మెలితిప్పి స్టెప్పులేడం హృతికికే చెల్లింది. ఇక యాక్టింగ్ ప‌రంగా హృతిక్ అసాధార‌ణ నటుడు. అత‌ని న‌ట‌న‌ని మెచ్చ‌ని ప్రేక్ష‌కుడు లేడు.

అంత‌టి టాప్ స్టార్ స్టైలిష్ స్టార్ బ‌న్నీ డాన్సు గురించి ఏమ‌న్నారో? తెలుసా? అంటే ! బ‌న్నీ గొప్ప డాన్స‌ర్ అంటూ ప్ర‌శంసించారు. ఓ ఇంట‌ర్వ్యూ సాక్షిగా బ‌న్ని డాన్సు గురించి ఏమంటార‌ని హృతిక్ ని ప్ర‌శ్నించ‌గా..`ఓ మై గాడ్.. ఎన‌ర్జ‌టిక్ స్ర్టాంగ్...సూప‌ర్ డాన్స‌ర్` అంటూ పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తారు. డాన్సింగ్ ల్లో బ‌న్నీ స్పూర్తి దాయ‌కం అంటూ గొప్ప‌గా ప్ర‌శంసించారు. దీంతో బ‌న్నీ అభిమానులు ఆనందానికి అవ‌దుల్లేవ్. సాక్షాత్తు బాలీవుడ్ టాప్ స్టారే త‌మ అభిమాన హీరో డాన్సుల గురించి ప్ర‌శంసించార‌ని సంబ‌ర‌ప‌డిపోతున్నారు.

నిజ‌మే బ‌న్నీ గొప్ప డాన్స‌ర్ అని ప్ర‌త్యేకించి చెప్పాల్సిన ప‌నిలేదు. బ‌న్నీ టైమింగ్ ఎన‌ర్జిటిక్ డాన్సింగ్ గురించి ఇప్ప‌టికే చాలా మంది కొరియోగ్రాప‌ర్లు...హీరోలు ప్ర‌శంసించారు. చిరంజీవి త‌ర్వాత ఆ ఫ్యామిలీ లో గొప్ప డాన్స‌ర్ గా నిలిచేది బన్నీ ఇప్ప‌టికే ఓ ముద్ర ప‌డి పోయింది. తాజాగా హృతిక్ స్టాంప్ తో బ‌న్నీ టాలీవుడ్ లో మిగ‌తా హీరోల‌కంటే ఓ మెట్టు పైనే ఉన్నాడ‌ని అభిమానులు చెబుతున్నారు. కొన్నాళ్ల‌గా బ‌న్నీ స్టెప్పుల‌ను హృతిక్ కాపీ కొడుతున్నార‌ని ఓ ప్ర‌చారం సాగుతోన్న వేళ హృతిక్ తాజా కామెంట్లు మ‌రింత ఆస‌క్తిని పెంచుతున్నాయి.