Begin typing your search above and press return to search.

తెలుగు మార్కెట్ పై అలా కన్నేశాడు

By:  Tupaki Desk   |   7 Dec 2016 11:00 AM IST
తెలుగు మార్కెట్ పై అలా కన్నేశాడు
X
తెలుగు సినీ మార్కెట్లో కాస్త క్లిక్ అయి.. మన ఆడియెన్స్ కి రిజిష్టర్ అయితే చాలు ప్రతీ హీరో తమ సినిమాని తెలుగు డబ్బింగ్ చేసి వదిలేయడానికి రెడీ అయిపోతాడు. ఇప్పటికే కోలీవుడ్ హీరోలు తెలుగు మార్కెట్ పై కన్నేసి కోట్లు కొల్లగొడుతున్నారు. డబ్బింగ్ బొమ్మలకి కాసులు కురిపిస్తుండే సరికి ఇప్పుడు బాలీవుడ్ హీరోలు కూడా ఇదే రూట్ ఫాలో అయిపోతున్నారు.

నిజానికి మన దగ్గర హిందీ సినిమాలకి ఆదరణ ఎక్కువే. అయితే ఇదంతా బాలీవుడ్ అంటే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లో.. హిందీ వచ్చిన వాళ్లో లేదూ సిటీస్ కే పరిమితం. అందుకే డబ్బింగ్ చేసి వదిలితే అందరూ చూస్తారనే ఆలోచనతో బాలీవుడ్ హీరోలు ఈ మధ్య తమ మూవీస్ ని తెలుగులోకి అనువదిస్తున్నారు. సల్మాన్ ప్రేమ్ రతన్ ధన్ పాయో వదిలితే.. ఆమిర్ దంగల్ ని తెలుగులోకి తెస్తున్నారు. వీటితో పాటు హృతిక్ కాబిల్ మూవీ కూడా తెలుగులో బలం పేరుతో రాబోతుంది.

అయితే హృతిక్ రోషన్ కహోనా ప్యార్ హై దగ్గర్నుంచి క్రిష్ సిరీస్ వరకు ప్రతీ సినిమా తెలుగులోకి డబ్బైంది. కలెక్షన్స్ కూడా చెప్పుకోతగ్గ స్థాయిలోనే వచ్చాయ్. కానీ మొహంజదారో దారుణంగా ఫ్లాపయ్యే సరికి అలర్టైన హృతిక్ బలం విషయంలో అలా జరగకూడదు అనుకుంటున్నాడు. అందుకే కొత్త మూవీకి గట్టిగా ప్రమోషన్స్ చేయాలని ఫిక్సయ్యాడు. పైగా హీరోయిన్ యామీ గౌతమ్ తెలుగు ఆడియెన్స్ కి పరిచయముంది కాబట్టి ప్రచారం మీద దృష్టి పెడితే మళ్లీ తెలుగు ఆడియెన్స్ కి దగ్గరవ్వచ్చనేది హృతిక్ ప్లాన్. మరి జనవరిలో బడా సినిమాల మధ్యలో హృతిక్ ఎంత బలం చూపిస్తాడో!!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/