Begin typing your search above and press return to search.

ఆసియా శృంగార పురుషుడు హృతిక్‌

By:  Tupaki Desk   |   17 Dec 2015 9:44 AM IST
ఆసియా శృంగార పురుషుడు హృతిక్‌
X
గ్రీకు వీరుడు.. అన్న ప‌దానికి ప‌ర్యాయం వెతికితే స‌రైన స‌మాధానం - బాలీవుడ్ హీరో హృతిక్ రోష‌న్ అని చెప్పొచ్చు. మ‌గువ‌ల మ‌న‌సు దోచే సుంద‌రాంగుడిగా అత‌డు పాపుల‌ర్‌. గాళ్స్ లో విప‌రీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో అత‌డు. ఎంత‌గా అంటే ఆసియాలోనే టాప్ -2 శృంగార పురుషుడిగా అవార్డు క‌ట్ట‌బెట్టేంత‌. ప్ర‌ఖ్యాత వార ప‌త్రిక ఐఫీస్ట్ నిర్వ‌హించిన ఓ పోల్‌ లో 50 మంది సెక్సీయెస్ట్ పురుషుల జాబితాలో హృతిక్‌ రోష‌న్ రెండో స్థానాన్ని ద‌క్కించుకున్నాడు.

బ్రిట‌న్‌ కి చెందిన పాప్ స్టార్ జ‌యాన్ మాలిక్ అత్య‌థిక వోట్ల‌తో మొద‌టి స్థానంలో నిలిచాడు. ఇక పాకిస్తాన్ న‌టుడు ఫ‌హ‌ద్ ఖాన్ 6వ స్థానంలో - కండ‌ల హీరో స‌ల్మాన్ ఖాన్ 7వ స్థానంలో - షాహిద్ క‌పూర్ 8వ స్థానంలో - షారూక్‌ఖాన్ 9 స్థానంలో నిలిచారు. కాస్త వ‌య‌సు ఎక్కువ ఉన్న శృంగార పురుషుడిగా షారూక్ పేరు తెచ్చుకున్నాడు. వాస్త‌వంగా గ‌త ఏడాది ఇదే పోల్‌ లో హృతిక్ రోష‌న్ ఆసియాలోనే నంబ‌ర్‌-1 శృంగార పురుషుడిగా పేరు తెచ్చుకున్నాడు. తీరైన దేహ‌శిరుల‌తో నిజ‌మైన గ్రీకు శిల్పంలా క‌నిపించే ఈ హీరోకి ఎప్ప‌టికీ మ‌గువ‌ల్లో క్రేజు త‌గ్గ‌దు అని చెప్పొచ్చు.