Begin typing your search above and press return to search.

'వీరం' రీమేక్ లో సూప‌ర్ హీరో

By:  Tupaki Desk   |   4 Aug 2019 9:41 PM IST
వీరం రీమేక్ లో సూప‌ర్ హీరో
X
త‌ళా అజిత్ న‌టించిన మాస్ మ‌సాలా యాక్షన్ సినిమా `వీరం` ఎంత పెద్ద హిట్ట‌య్యిందో తెలిసిందే. ద‌రువు శివ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. పండు గ‌డ్డం- త‌ల‌క‌ట్టు.. నెరిసిన‌ కోర మీసంతో అజిత్ కొత్త గెట‌ప్ మ్యాజిక్ చేసింది. మునుపెన్న‌డూ క‌నిపించ‌నంత కొత్త‌గా మైమ‌రిపించే యాక్టింగ్ స్టైల్ తో క‌ట్టి ప‌డేశాడు. ప్ర‌స్తుతం ఈ సినిమాని హిందీలో రీమేక్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.

కండ‌ల హీరో హృతిక్ కోసం స్క్రిప్టు రెడీ అవుతోంద‌ట‌. ఖాన్ లు.. కిలాడీ అక్ష‌య్‌ త‌ర‌హాలోనే హృతిక్ కూడా రీమేక్ బాట‌లోకి వ‌చ్చి చేస్తున్న ప్ర‌య‌త్న‌మిది. నిర్మాత సాజిద్ ఖాన్ ఇప్ప‌టికే రైట్స్ తీసుకుని హిందీ స్క్రిప్టును రెడీ చేస్తున్నాడు. అజిత్ స్టైల్ తో పోలిస్తే హృతిక్ స్టైల్ భిన్నం. అత‌డి రూపురేఖ‌లు సూప‌ర్ హీరోని త‌ల‌పిస్తాయి. క్రిష్ సిరీస్ తో ఆ ఇంపార్ట్ ప‌డింది. అందుకు త‌గ్గ‌ట్టే క‌థ‌ని మౌల్డ్ చేస్తున్నార‌ట‌.

మ‌రోవైపు ఈ సినిమాతో పాటు వ‌రుస‌గా మూడు నాలుగు సినిమాల‌కు సంబంధించిన స్క్రిప్టుల్ని హృతిక్ ఫైన‌ల్ చేస్తున్నాడు. ఇందులో క్రిష్ 4 ని 2020 సెప్టెంబ‌ర్ లో ప్రారంభించేందుకు నిర్మాత రాకేష్ రోష‌న్ ఇప్ప‌టినుంచే స‌న్నాహాలు చేస్తున్నారు. అత‌డు స్క్రిప్టు ప‌నిలోనే ఉన్నారు. మ‌రోవైపు `స‌త్తే పే స‌త్తా` రీమేక్ లోనూ న‌టించేందుకు రైట్స్ తీసుకుంటున్నార‌ట‌. ఫ‌రా ఖాన్.. రోహిత్ శెట్టి ఈ ప్రాజెక్టులో ఇన్వాల్వ్ అవుతున్నారు. `సూప‌ర్ 30` స‌క్సెస్ త‌ర్వాత హృతిక్ మ‌రింత స్పీడ్ పెంచిన‌ట్టే క‌నిపిస్తోంది.