Begin typing your search above and press return to search.

హృతిక్ ఎంత మారిపోయాడండీ

By:  Tupaki Desk   |   18 May 2018 4:50 PM IST
హృతిక్ ఎంత మారిపోయాడండీ
X
బాలీవుడ్ లో ఉన్న స్టైలిష్ హీరోలలో హృతిక్ రోషన్ ఒకరు. అతను స్టెప్పు లేసినా ఫైట్ చేసిన దాంట్లో స్టైల్ ని చూపించడం అలవాటు. ఎంతమంది యువ హీరోలు వచ్చినా కూడా హృతిక్ గ్లామర్ ని క్రాస్ చేయడం అంత సులభం కాదు. ఎక్కువగా డిఫరెంట్ సినిమాలను చేసే ఈ హీరో నెక్స్ట్ తన సినిమా కోసం తన ఫిట్నెస్ లో చాలా మార్పులు తెచ్చాడు. ప్రస్తుతం హృతిల్ ఒక బయోపిక్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే.

సూపర్ 30 అనే సినిమా కోసం హృతిక్ తనలో చాలా మార్పు తెచ్చుకున్నాడు. ఒక లెక్కల మాష్టారు ఆనంద్ కుమార్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఆ పాత్ర కోసం ఈ కండల వీరుడు సినిమా షూటింగ్ ముందు నుంచి వర్కౌట్ చేశాడు. ఇకపోతే రీసెంట్ గా విడుదలైన ఒక ఫొటోను చూస్తే అది మనకు అర్ధమవుతుంది. అతనితో పాటు పక్కన సీనియర్ బుల్లితెర నటుడు వీరేంద్ర సక్సెనా కూడా ఉన్నారు. ఆ ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో విరల్ గా మారింది.

సూపర్ 30 వచ్చే ఏడాది జనవరిలో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. అందుకోసం హృతిక్ అభిమానులని కాకుండా నార్త్ ప్రజలు చాలానే ఎదురుచూస్తూన్నారు. మరికొత్తగా కనిపిస్తోన్న హృతిమ్ సినిమల్ ఎలా ఉంటాడో చూడాలి.