Begin typing your search above and press return to search.
ఒలంపిక్ మెడల్ కోసం అథ్లెట్లు కష్టపడ్డట్లుగా హీరోలు కష్టపడాలి
By: Tupaki Desk | 26 Nov 2021 7:00 PM ISTబాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ ప్రస్తుతం జరుగుతున్న 52వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో వర్చువల్ గా ఆడియన్స్ కు తన సందేశాన్ని అందించాడు. గోవాలో జరుగుతున్న ఈ ఫిల్మ్ ఫెస్టివ్ లో పెద్ద ఎత్తున ఇండియన్ సినిమాలు ప్రదర్శితం అవుతున్నాయి. ఇదే సమయంలో ఓటీటీ కి పెరిగిన మార్కెట్ మరియు వెబ్ సిరీస్ మరియు వెబ్ సిరీస్ ల ద్వారా పెరిగిన అవకాశాల గురించి గెస్ట్ లు ముచ్చటించారు. ఈ విషయమై హృతిక్ రోషన్ కూడా మాట్లాడాడు. ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ మారుతున్న కాలంతో పాటు మనం మారాలి. ప్రతి ఒక్కరు కూడా టెక్నాలజీని అంది పుచ్చుకున్నప్పుడే అభివృద్దిలో ముందుకు వెళ్తాం అన్నట్లుగా హృతిక్ రోషన్ చెప్పుకొచ్చాడు.
ప్రస్తుతం ఇంటర్నెట్ రాజ్యం నడుస్తోంది. ఈ ఇంటర్నెట్ అనేది రాబోయే కాలంలో స్టార్ కల్చర్ ను రూపు మాపబోతుంది. ఇప్పటికే స్టార్స్ కంటే ఇంటర్నెట్ ద్వారా గుర్తింపు దక్కించుకున్న వారు ఎంతో మంది ఉన్నారు. కనుక ప్రతి ఒక్కరు కూడా ఇంటర్నెట్ లో చాలా విభిన్నమైన కంటెంట్ ను చూస్తూ.. చేస్తూ కొత్తగా జనాలకు దగ్గర అవుతున్నారు. ఓటీటీల ద్వారా సినిమాలు ఇంట్లోకే వస్తున్నాయి. ఇది కూడా ఆహ్వానించదగ్గ పరిణామం. కాలం మారుతూ ఉన్నప్పుడు మనం మారాలి కనుక కొత్త పద్దతులు అలవాటు చేసుకోవాల్సిందే అన్నట్లుగా హృతిక్ రోషన్ జనాలకు సూచించాడు. ఇండస్ట్రీ వారు కూడా జనాల అభిరుచిని అర్థం చేసుకుని సినిమాలను నిర్మించాల్సిందిగా సూచించాడు.
ఇక నటీ నటులు మరియు ఇతర సాంకేతిక నిపుణులు ప్రతి ఒక్కరు కూడా రోజు కష్టపడాలని అన్నాడు. ఒలంపిక్ గేమ్స్ కు వెళ్లే వారు ప్రతి రోజు గంటల తరబడి ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి.. కష్టపడుతూ ఉండాలి. ఎలా రోజూ క్రీడాకారులు ఒలంపిక్స్ కోసం ప్రాక్టీస్ చేస్తారో అలాగే హీరోలు మరియు ఇతర ఇండస్ట్రీ వర్గాల వారు కూడా కష్టపడాలి. అప్పుడే సక్సెస్ లు దక్కుతాయి.. ఇండస్ట్రీలో గుర్తింపు వస్తుందని హృతిక్ కొత్త వారికి సలహా ఇచ్చాడు. కష్టపడకుండా ఎవరు సక్సెస్ అవ్వలేరంటూ హృతిక్ రోషన్ చెప్పుకొచ్చాడు. కొత్త ఫిల్మ్ మేకర్స్ కు మరియు నటీ నటులకు ఆయన వ్యాఖ్యలు ఖచ్చితంగా ఉపయోగదాయకం.