Begin typing your search above and press return to search.

క్లాసిక్ రీమేక్ లో కండల హీరో

By:  Tupaki Desk   |   7 Jun 2019 2:33 PM IST
క్లాసిక్ రీమేక్ లో కండల హీరో
X
అది 1982వ సంవత్సరం. బాలీవుడ్ మెగాస్టార్ గా అప్పటికే అగ్ర సింహాసనం వైపు అమితాబ్ బచ్చన్ వడివడిగా అడుగులు వేస్తున్నాడు. అప్పుడు వచ్చిందే సత్తే పే సత్తా. ఏడుగురు అన్నదమ్ముల కథగా దర్శకుడు ఎన్ సిప్పి మలచిన తీరుకు బాక్స్ ఆఫీస్ దగ్గర బొమ్మ బ్లాక్ బస్టర్ అయ్యింది. హేమా మాలిని నటన కుర్రాళ్ళుగా చేసిన సోదర బ్యాచ్ అటు అల్లరి ఇటు ఎమోషన్ రెండు బాలన్స్ చేస్తూ అప్పటి ప్రేక్షకులను మైమరపింపజేసింది.

ఇప్పుడు దీన్ని బాలీవుడ్ లో రీమేక్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఫర్హాన్ అక్తర్ నిర్మాణంలో రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపొందించేందుకు ప్రాధమిక ఏర్పాట్లు పూర్తయినట్టుగా ముంబై టాక్. హీరోగా బిగ్ బి పాత్ర ఎవరితో చేయించాలనే మీమాంస చాలా కాలం వెంటాడిన తర్వాత ఫైనల్ గా హృతిక్ రోషన్ ను లాక్ చేస్తున్నట్టు తెలిసింది. ఇది స్క్రిప్ట్ దశలో ఉన్నప్పుడు ముందు షారుఖ్ ఖాన్ అని అనుకున్నారు. కానీ కథ డిమాండ్ దృష్ట్యా కాస్త మిడిల్ ఏజ్ హీరో అయితే బాగుంటాడు అనే ఉద్దేశంతో ఫార్టీ ప్లస్ హీరోకు ఓటేశారు.

పైగా స్క్రిప్ట్ ప్రకారం కండలు ప్రదర్శించి ఫైట్లు చేసే సీన్స్ కూడా ఉంటాయట. అవన్నీ షారుఖ్ చేస్తే అంతగా నప్పదు అనుకున్నారో ఏమిటో కానీ బాల్ హృతిక్ వద్ద వచ్చి పడింది. అమితాబ్ క్లాసిక్స్ ని రీమేక్ చేయడం కొత్తేమి కాదు. డాన్ ని షారుఖ్ ఖాన్ ట్రై చేసి సక్సెస్ అయ్యాడు. షోలేని తీసి రామ్ గోపాల్ వర్మ నవ్వులపాలయ్యాడు. దీవార్ గురించి ఎప్పటి నుంచో చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడీ సత్తే పే సత్తాకు రెక్కలు వస్తున్నాయి. ఈ ఏడాది లోనే ప్రారంభించి వచ్చే సంవత్సరం విడుదల చేసే ప్లానింగ్ లో ఉంది టీమ్. షూటింగ్ మొదలవ్వడానికి ఇంకా టైం పట్టేలా ఉంది