Begin typing your search above and press return to search.

సైడ్‌ డాన్సర్స్‌ కు సాయం చేసిన సూపర్‌ స్టార్‌

By:  Tupaki Desk   |   26 July 2020 10:00 PM IST
సైడ్‌ డాన్సర్స్‌ కు సాయం చేసిన సూపర్‌ స్టార్‌
X
కరోనా కారణంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అస్థవ్యస్థం అయ్యింది. ముఖ్యంగా రోజూ వారి పారితోషికంతో బతికే కూలీలు మరియు సినీ కార్మికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. నెలలు నెలలుగా షూటింగ్స్‌ లేకపోవడంతో సినీ కార్మికులు తినడానికి తిండి కూడా లేక అవస్థలు పడుతున్నారు. సినిమాకు చెందిన 24 విభాగాలకు చెందిన కార్మికులు మరియు రోజు వారి పారితోషికంతో పని చేసే వారు ఆర్థిక సాయం కోసం ఎదురు చూస్తున్నారు.

సినిమా షూటింగ్స్‌ లో సైడ్‌ డాన్సర్స్‌ గా ఉండే ఎంతో మంది డాన్సర్స్‌ కు ఇప్పుడు పని లేకుండా పోయింది. తెలుగు మరియు తమిళ డాన్సర్స్‌ కు లారెన్స్‌ సాయం చేశాడు. ఇప్పుడు బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ హృతిక్‌ రోషన్‌ కూడా డాన్సర్స్‌ కోసం తనవంతు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. డాన్సర్స్‌ అకౌంట్స్‌ లో నేరుగా డబ్బులు వేశారట.

ఈ విషయాన్ని డాన్సర్స్‌ కో ఆర్డినేటర్‌ రాజు సురానీ మీడియాకు తెలియజేశాడు. హృతిక్‌ రోషన్‌ మంచి మనసుతో వంద మంది డాన్సర్స్‌ కు హృతిక్‌ రోషన్‌ సాయం చేశారు. షూటింగ్స్‌ లేకుండా గత నాలుగు నెలలుగా ఇబ్బందులు పడుతున్న డాన్సర్స్‌ బాధలు తెలుసుకున్న ఆయన సాయం చేశారంటూ రాజు సురానీ అన్నారు.