Begin typing your search above and press return to search.
హృతిక్ డీల్ చూస్తే కళ్లు తిరుగుతాయ్
By: Tupaki Desk | 13 July 2016 1:39 PM ISTఆరు సినిమాలు.. రూ.550 కోట్లు.. ఇలాంటి శాటిలైట్ డీల్ ఇండియా ఇప్పటిదాకా ఎన్నడైనా విన్నారా..? బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ ఈ కళ్లు చెదిరే డీల్ తో అందరికీ షాకిచ్చాడు స్టార్ టీవీ ఛానెల్ తో ఈమేరకు అతను ఒప్పందం చేసుకున్నాడు. హృతిక్ భవిష్యత్తులో చేయబోయే ఆరు సినిమాలకు కలిపి అతడికి రూ.550 కోట్లు చెల్లించడానికి ముందుకొచ్చింది స్టార్ టీవీ. అంటే ఒక్కో సినిమాకు సగటున రూ.90 కోట్ల వరకు చెల్లిస్తోందన్నమాట ఆ ఛానెల్. అమీర్ ఖాన్.. సల్మాన్ ఖాన్ సినిమాలకు సైతం ఇప్పుడీ రేటు లేదు. ఐతే భవిష్యత్తులో భారీగా శాటిలైట్ రైట్స్ ధరలు పెరుగుతాయన్న అంచనాతో హృతిక్ తో ఈ భారీ డీల్ కుదుర్చుకుంది స్టార్.
ప్రస్తుతం హృతిక్ కొత్త సినిమా ‘మొహెంజదారో’ విడుదలకు సిద్ధంగా ఉంది. దీని శాటిలైట్ హక్కులు రూ.50 కోట్ల దాకా పలుకుతున్నట్లు వార్తలొస్తున్నాయి. మరోవైపు తన సొంత నిర్మాణ సంస్థలో తెరకెక్కుతున్న ‘కాబిల్’ శాటిలైట్ రైట్స్.. సినిమా మొదలవడానికి ముందే ఓ ఛానెల్ కు రూ.45 కోట్లకు కట్టబెట్టేశాడు హృతిక్. స్టార్ టీవీతో కుదుర్చుకున్న ఒప్పందం ‘కాబిల్’ తర్వాత చేసే ఆరు సినిమాలకు వర్తిస్తుంది. ప్రస్తుతం బాలీవుడ్ సూపర్ స్టార్లందరూ ఇలాగే డీల్స్ కుదుర్చుకుంటున్నారు. సల్మాన్ ఖాన్ కూడా ఇలాగే ఓ ఛానెల్ తో డీల్ చేసుకున్నాడు. అంటే ఈ హీరోలతో సినిమాలు చేయాలనుకునే నిర్మాతలు శాటిలైట్ హక్కుల గురించి మాట్లాడకూడదన్నమాట. దాన్నే పారితోషకం కింద లెక్కబెట్టుకుని.. సినిమాలు చేయడానికి డీల్ చేసుకోవాలన్నమాట.