Begin typing your search above and press return to search.
రోగ్ హీరోయిన్ గాలి తీసేసిన హీరో
By: Tupaki Desk | 4 April 2017 4:42 PM ISTఈ మధ్యే విడుదలైన పూరి జగన్నాథ్ సినిమా ‘రోగ్’తో తెలుగు పరిశ్రమకు పరిచయమైంది ఏంజెలా అనే కొత్త హీరోయిన్. పూరి కనెక్ట్స్ ద్వారా హీరోయిన్ గా అవకాశం దక్కించుకున్న ఈ అమ్మాయి.. ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో పిచ్చాపాటిగా మాట్లాడుతూ హృతిక్ రోషన్ ప్రస్తావన తెచ్చింది ఏంజెలా. హృతిక్ తనకు మంచి ఫ్రెండ్ అని.. అతను మెంటార్ కూడా అని.. అతడికి తన సినిమాల గురించి ఎప్పటికప్పుడు సమాచారం కూడా ఇస్తుంటానని స్టేట్మెంట్ ఇచ్చింది ఏంజెలా. ఐతే ఆమె ఇంటర్వ్యూ ఇచ్చింది డీఎన్ ఏ లాంటి ప్రముఖ పత్రికకు కావడంతో అది హృతిక్ రోషన్ కళ్లల్లో పడింది. అతను ఏంజెలా గాలి తీసేస్తూ ఒక ట్వీట్ పెట్టాడు.
అందులో.. ‘‘డియర్ లేడీ.. అసలు ఎవరు నువ్వు? ఎందుకు అబద్ధాలు చెబుతున్నావు’’ అంటూ ప్రశ్నించాడు హృతిక్. దీంతో పాటుగా ఏంజెలా ఇంటర్వ్యూకు సంబంధించిన పేపర్ కటింగ్ కూడా షేర్ చేశాడు హృతిక్. దీంతో ఏంజెలా చెప్పినవన్నీ సొల్లు కబుర్లని తేలిపోయింది. హృతిక్ ఏమీ ఆటపట్టిస్తున్నట్లుగా కూడా లేదు. అతను ఈ వ్యవహారాన్ని సీరియస్ గానే తీసుకున్నట్లుంది. ఆల్రెడీ కంగనా రనౌత్ తో ఎదురైన అనుభవం దృష్టిలో ఉంచుకునో ఏమో.. తన ఇమేజ్ దెబ్బ తినకుండా జాగ్రత్త పడుతున్నట్లున్నాడు హృతిక్. మొత్తానికి హృతిక్ నువ్వెవరంటూ ప్రశ్నించడంతో ఏంజెలాకు తలకొట్టేసినట్లే అయి ఉంటుందిప్పుడు. ‘రోగ్’ ద్వారా ఆశించిన ప్రయోజనం దక్కకపోగా.. ఇప్పుడు హృతిక్ ఇలా గాలి తీసేయడం ఏంజెలాకు ఇబ్బందికర విషయమే.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/