Begin typing your search above and press return to search.
ఎన్టీఆర్ కు హృతిక్ కాంప్లిమెంట్స్
By: Tupaki Desk | 8 Jan 2016 1:14 PM ISTఎన్టీఆర్ టాలెంట్ గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. అతడికి సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. పరిశ్రమ వర్గాల్లో కూడా బోలెడంత మంది అభిమానులున్నారు. ప్రస్తుత యువ కథానాయకుల్లో బెస్ట్ పెర్ఫార్మర్ ఎవరు అంటే చాలామంది ఎన్టీఆర్ పేరు చెబుతారు. ఐతే ఇప్పుడు పొరుగు ఇండస్ట్రీలకు చెందిన తారలు సైతం ఎన్టీఆర్ కేక అని స్వచ్ఛందంగా చెబుతుండటం విశేషం.
మొన్నే తమిళ సీనియర్ నటి ఖష్బూ ఎన్టీఆర్ మీద తన అభిమానాన్ని చాటుకుంది. ‘‘నాకు తరచుగా ప్రశ్నలు సంధించే ఏపీ - తెలంగాణలోని తెలుగువారందరికీ చెబుతున్నా. నేను జూనియర్ ఎన్టీఆర్ కు డైహార్డ్ ఫ్యాన్. అతడి సినిమాలు మిస్సవడం చాలా తక్కువ’’ అని ట్వీట్ చేసింది ఖుష్బూ. ‘నాన్నకు ప్రేమతో’ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు కూడా ఆమె వెల్లడించింది.
ఇప్పుడిక బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన హృతిక్ రోషన్ సైతం తారక్ మీద ప్రశంసల జల్లు కురిపించాడు. ఇటీవలే హైదరాబాద్ లో జరిగిన ఓ ఈవెంట్లో హృతిక్ మాట్లాడుతూ.. తనకు ఎన్టీఆర్ అంటే ఇష్టమని చెప్పాడు. ఎన్టీఆర్ డ్యాన్సులు ఎలక్ట్రిఫైయింగ్ గా ఉంటాయని.. అతను మంచి పెర్ఫార్మర్ అని కితాబిచ్చాడు హృతిక్. స్వయంగా గ్రేట్ డ్యాన్సర్ అయిన హృతిక్... ఎన్టీఆర్ డ్యాన్సులకు కాంప్లిమెంట్ ఇవ్వడం విశేషమే.