Begin typing your search above and press return to search.
హృతిక్ కు తెలియకుండానే యాడ్.. వ్వాటే తెలివి
By: Tupaki Desk | 13 Jun 2022 9:00 PM ISTచిత్ర పరిశ్రమలో ఇటీవల కాలంలో కమర్షియల్ యాడ్స్ అనేవి సినీ తారలకు మరొక మంచి ఆదాయం గా మారుతున్నాయి అనే చెప్పాలి. ఒకవైపు సినిమాలు చేసుకుంటూ మరొకవైపు ప్రముఖ కంపెనీలకు చెందిన ప్రకటనల్లో నటిస్తూ మంచి పారితోషికాలను అందుకుంటున్నారు. ఒక విధంగా కొందరు స్టార్స్ అయితే సినిమాల కంటే ఎక్కువగా యాడ్స్ ద్వారా నేను సంపాదిస్తూ ఉండడం విశేషం.
ఒక్కరోజు వర్క్ చేసినా చాలు యాడ్స్ ద్వారా కోట్లు అందుతున్నాయి. ఒక్కొక్కరూ ఒక్కో విధంగా వారి తెలివిని ఉపయోగించి స్టార్స్ తో ప్రమోషనల్ యాడ్స్ వదులుతున్నారు. అయితే రీసెంట్ గా హృతిక్ రోషన్ కు సంబంధించిన ఒక యాడ్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బర్గర్ కింగ్ అనే కంపెనీ హృతిక్ రోషన్ షూటింగ్లో ఉండగా ఫోటోలు తీసేందుకు మీడియా సభ్యులు పోటీపడినట్లు గా చూపించారు.
అయితే హృతిక్ రోషన్ స్టిల్ ఇవ్వగానే వెనకాల నుంచి బోర్డును కూడా పెట్టారు. దీంతో ఇది తెలివైన ప్రమోషన్ అని నెటిజన్లు స్పందిస్తున్నారు. నిజానికి ఇది తెలియకుండా అయితే ఏమీ చేయలేదు. ఒక స్టార్ హీరోతో అంత పెద్ద కంపెనీ ప్రమోట్ చేయాలి అంటే తప్పకుండా అతని పర్మిషన్ తీసుకోవాలి. లేదంటే ఆ తరువాత చట్టపరమైన చిక్కులు కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఈ స్టార్స్ కూడా ఆ విధంగా పొరపాట్లు జరగకుండా చూసుకుంటారు. రూపాయి కూడా అలా వధులుకునేందుకు ఇష్టపడరు. ఇక ఈ యాడ్ కూడా ముందుగా ఒక ప్రణాళికతోనే చాలా తెలివిగా డైరెక్ట్ చేసినట్లు అర్థమైంది. ఇక హ్రితిక్ రోషన్ సినిమాల విషయానికి వస్తే ఇటీవల విక్రమ్ వేదా రీమేక్ ను ఫినిష్ చేసిన విషయం తెలిసిందే. ఆ సినిమాను త్వరలోనే విడుదల చేయాలని నిర్మాతలు చర్చలు జరుపుతున్నారు. అలాగే హృతిక్ రోషన్ నుంచి క్రిష్ 4 సినిమా కూడా రావాల్సి ఉంది. మరోవైపు పాన్ ఇండియా సినిమాలు చేసేందుకు కూడా ఈ స్టార్ యాక్టర్ చర్చలు జరుపుతున్నారు.