Begin typing your search above and press return to search.

ఆ ట్వీట్ పై సారీ చెప్పాడు

By:  Tupaki Desk   |   4 April 2016 10:57 AM IST
ఆ ట్వీట్ పై సారీ చెప్పాడు
X
బాలీవుడ్ సూపర్ స్టార్లలో ఒకడైన హృతిక్ రోషన్ కు - స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ కు మధ్య విబేధాల సంగతి తెలిసిందే. ప్రెస్ మీట్లు - నోట్ల సాక్షిగా ఇద్దరూ రచ్చకెక్కారు. ట్వీట్టతో తిట్టిపోసుకున్నారు. ఒకరిపై ఒకరు లీగల్ నోటీసులు ఇచ్చుకుని.. ఓ బ్రేకప్ జంట ఏవైతే చేయకూడదో అవన్నీ చేసేశారు. వీరి మధ్య గొడవలోకి పోప్ ను లాగడంతో హృతిక్ రోషన్ ఇరుక్కుపోయాడు.

'మీడియా నాకు ఎవరితోనో ఎఫైర్ ఉందని అంటోంది. వాళ్లు చెప్పే బాలీవుడ్ అందగత్తెల కంటే.. నాకు పోప్ తో ఎఫైర్ పెట్టుకోవడానికే ఎక్కువ అవకాశాలున్నాయి' అంటూ ట్వీట్ చేశాడు హృతిక్. ఇది ఇన్ డైరెక్టుగా కంగనాకు వేసిన కౌంటర్ అయినా.. డైరెక్ట్ గా మాత్రం పోప్ ను అవమానపరిచేలా ఉంది. దీంతో ఇండియన్ క్రిస్టియన్ వాయిస్ సంస్థ.. ఈ సూపర్ స్టార్ కి లీగల్ నోటీసులు పంపింది. పోప్ ను - క్రైస్తవ మతస్థుల మనోభావాలను దెబ్బ తీశాడని ఆ నోటీసులో ఉంది.

తమ ఇద్దరి బ్రేకప్.. మతానికి సంబంధించిన వివాదంలో తనను ఇరికించేయడంతో.. వెనక్కి తగ్గక తప్పలేదు హృతిక్ కి. అందుకే ఇప్పుడు మరో ట్వీట్ చేశాడు. 'నేను ఆయన గొప్పదనాన్ని గురించి చేసిన ట్వీట్.. అపార్ధాలకు దారి తీసింది. ఆ మతాన్ని - మత విశ్వాసాలను ఇబ్బంది పెట్టినందుకు నా క్షమాపణలు, ఇది నేను ఉద్దేశ్యపూర్వకంగా చేయలేదు' అంటూ మరో ట్వీట్ పెట్టి బహిరంగ క్షమాపణ కోరాడు హృతిక్ రోషన్.