Begin typing your search above and press return to search.

టెర్రర్ ఎటాక్‌ తప్పించుకున్న స్టార్‌ హీరో

By:  Tupaki Desk   |   29 Jun 2016 11:40 AM IST
టెర్రర్ ఎటాక్‌ తప్పించుకున్న స్టార్‌ హీరో
X
టర్కీ దేశంలోని ఇస్తాంబుల్ నగరానికి చెందిన అటాటర్క్ ఎయిర్ పోర్టులో మారణ హోమం జరిగిన సంగతి తెలిసిందే. ముగ్గురు తీవ్రవాదులు విచక్షణా రహితంగా జరిపిన కాల్పుల ఘటనలో.. 40కి మందికి పైగా చనిపోయారనే వార్తలు వస్తున్నాయి. ఏకే 47తో వీరు కాల్పులు జరిపి ఈ మానవ మారణహోమానికి పాల్పడ్డారు.

ఈ కాల్పుల ఘటనకు సంబంధించి ఉగ్రవాదుల సంఖ్య నుంచి మృతుల సంఖ్య వరకూ ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉండగా.. అయితే ఈ కాల్పుల సమయంలో బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ అక్కడే ఉన్నాడనే విషయం అందరికీ వణుకు పుట్టించింది. స్పెయిన్ - సౌతాఫ్రికా దేశాలకు తన ఇద్దరు పిల్లలతో కలిసి వెకేషన్ టూర్ వెళ్లిన హృతిక్ రోషన్.. టర్కీ రూట్ ద్వారా తిరిగి వస్తున్నాడు. 'ఇస్తాంబుల్ ఎయిర్ పోర్ట్ స్టాఫ్ సహాయం చేశారు. ఇది షాకింగ్ న్యూస్, మతం కోసం అమాయకులను బలి చేస్తున్నారు. టెర్రరిజానికి వ్యతిరకంగా మనమంతా సమైక్యంగా ఉండాలి' అంటూ ఘటన జరిగిన తర్వాత హృతిక్ రోషన్ ట్వీట్ చేశాడు. దీనికి ముందు హృతిక్ చేసిన ట్వీట్ ఒకటి కూడా చూడాల్సి ఉంది.

'కనెక్టింగ్ ఫ్లైట్ మిస్ అవడంతో ఇస్తాంబుల్ ఎయిర్ పోర్టులో ఇరుక్కుపోయాం. రేపు కానీ ఇంకో ఫ్లైట్ లేదు. ఎకానమీ క్లాస్ తీసుకున్నా. తొందరగా వచ్చేద్దామని ఉంది' అంటూ హృతిక్ ట్వీట్ చేసిన తర్వాత.. ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది. ఇద్దరు పిల్లలతో హృతిక్ రోషన్ క్షేమంగా ఉన్నాడని తెలియడంతో బాలీవుడ్ అంతా ఊపిరి పీల్చుకుంది.