Begin typing your search above and press return to search.

దీపిక‌ పై అలాంటి కామెంట్లు ఇబ్బంది క‌ర‌మే

By:  Tupaki Desk   |   18 Dec 2019 7:12 AM GMT
దీపిక‌ పై అలాంటి కామెంట్లు ఇబ్బంది క‌ర‌మే
X
ఆసియా లోనే సెక్సీయెస్ట్ హీరోగా హృతిక్ గాళ్స్ లో క్రేజు తెచ్చుకున్నాడు. ఆసియాలోనే సెక్సీయెస్ట్ హీరోయిన్ గా దీపిక‌కు క్రేజు ఉంది. ఇక ఆ ఇద్ద‌రూ క‌లిసి చాక్లెట్ తింటూ చేసిన‌ ర‌చ్చ అభిమానుల్లో వైర‌ల్ గా చ‌ర్చ‌కు తావిచ్చింది.

ఇటీవ‌ల ఓ పార్టీ లో క‌లుసుకున్న హృతిక్ - దీపిక చాక్లెట్ ని షేర్ చేసుకుంటూ ఒక‌రినొక‌రు ప్రేమ‌గా చూసుకుంటూ ఉన్న‌ వీడియో సామాజిక మాధ్య‌మాల్లో వేడెక్కిస్తోంది. ఈ వీడియో లో దీపిక కు చాక్లెట్ కేక్ తినిపిస్తున్న హృతిక్ తాను కూడా ఒక స్పూన్ చాక్లెట్ ని తిన్నాడు. అయితే దీని పై నెటిజ‌నుల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఇంత‌ రొమాంటిక్ మూవ్ మెంట్ లో రణ్ వీర్ ఎక్కడ? అంటూ కొంద‌రు నెటిజనులు సామాజిక మాధ్య‌మాల్లో ప్ర‌శ్నించడం ఆస‌క్తిగా మారింది.

హృతిక్ తో నిరంత‌రం దీపిక సోష‌ల్ మీడియాల్లో ట‌చ్ లో ఉంటోంది. ఇదివ‌ర‌కూ ఓ ట్వీట్ లో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌ను పోస్ట్ చేసింది. ``WAR లోని హృతిక్ కార్నర్ హౌస్... డెత్ బై చాక్లెట్ లాంటిది! ... జస్ట్ సేయింగ్ ..`` అని రాసింది. ఇంత‌లోనే ఇలా హృతిక్ ముందు నిలబడి... చాక్లెట్ తినే అవ‌కాశం త‌న‌ని వ‌రించింది. మొత్తానికి దీపిక‌ కల నిజమైంది. హృతిక్ ఒక చెంచాతో కేక్ తీసుకొని జాగ్రత్తగా తినిపించాడు. ఇక ఆ స‌మ‌యంలో దీపిక హృతిక్ ని ఆరాధ‌న‌గా చూడ‌డం... తన కళ్ళను అతని నుండి తిప్పుకునేందుకు అస్స‌లు ఇష్ట‌ప‌డ‌క‌పోవ‌డం నెటిజ‌నుల కంట ప‌డింది. దీనిపై ర‌క‌ర‌కాల ట్రోల్స్ మొద‌ల‌య్యాయి. ఇక ఇంత‌కుముందు దీపిక - హృతిక్ కలిసి ఓ పార్టీ నుండి సెల్ఫీని పోస్ట్ చేయడం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. మీ జంట‌ కలిసి సినిమా చేయాలని ఫ్యాన్స్ నుంచి రిప్ల‌య్ పోస్టులు వెల్లువెత్తాయి. స్టార్ల మ‌ధ్య స్నేహం .. అన్యోన్య‌త‌ను అర్థం చేసుకునే త‌త్వం నెటిజ‌నుల‌కు చాలా ఇంపార్టెంట్. హృతిక్ - దీపిక విష‌యంలో సంయ‌మ‌నం పాటించ‌కుండా కొంద‌రు కామెంట్లు చేయ‌డం ఇబ్బందిక‌ర‌మే.