Begin typing your search above and press return to search.

రోగ్ హీరోయిన్-హృతిక్ గొడవ అలా ముగిసింది

By:  Tupaki Desk   |   5 April 2017 4:33 PM IST
రోగ్ హీరోయిన్-హృతిక్ గొడవ అలా ముగిసింది
X
‘రోగ్’ హీరోయిన్ ఏంజెలా తనను ఫ్రెండుగా.. మెంటార్ గా సంబోధించడంపై బాలీవుడ్ సూపర్ స్టార్ హృతిక్ రోషన్ రెస్పాండవడం.. ‘ఎవరు నువ్వు.. ఎందుకు అబద్ధాలాడుతున్నావు’ అని ప్రశ్నించడం ద్వారా ఏంజెలా గాలి తీసేయడం తెలిసిన సంగతే. ఈ వివాదానికి ఏంజెలా సారీతో తెరపడింది. నిజానికి రోగ్ హీరోయిన్ తో హృతిక్ కు పూర్తిగా పరిచయమే లేదనేమీ కాదు. ఆమెతో కలిసి ఒక యాడ్ షూట్ చేశాడు. ఫొటోలు కూడా దిగాడు హృతిక్. అలాగని ఏంజెలా చెప్పుకున్నట్లు హృతిక్ ఆమెకు ఫ్రెండూ కాదు. మెంటారూ కాదు. జస్ట్ పరిచయం అంతే. ఈ వివాదం విషయంలో ఇద్దరూ కొంచెం అతి చేశారు. అందుకే ఈ గొడవ మీడియాలో హైలైట్ అయింది.

ఫారిన్ నుంచి వచ్చిన ఏంజెలా.. హృతిక్ తో ఏదో ఒక కమర్షియల్ చేసిందట. ఆ సందర్భంగా ఆమెకు హృతిక్ మంచి సలహాలిచ్చాడట. నీ లుక్స్ బాగున్నాయని.. సినిమాల్లో ట్రై చేయమని చెప్పాడట. అందుకే తాను హృతిక్ ను స్నేహితుడిలా.. మెంటార్ లా భావించానని.. అంతే తప్ప అతడి పేరును వాడుకునే ఉద్దేశమేమీ లేదని ఏంజెలా వ్యాఖ్యానించింది. హృతిక్ తో తాను దిగిన ఫొటోల్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఆ హీరోకు సారీ కూడా చెప్పింది. ఈ వివరణ పట్ల హృతిక్ సంతృప్తి చెందాడు. ఈ సందర్భంగా అతను మీడియాను నిందించాడు. ‘మిస్ లీడింగ్ హెడ్ లైన్స్’ అంటూ ఏంజెలాతో ఇంటర్వ్యూ ప్రచురించిన మీడియా సంస్థను విమర్శించాడు. ఆ రకంగా హృతిక్-ఏంజెలా వివాదానికి తెరపడింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/