Begin typing your search above and press return to search.

గ్రీక్ గాడ్ కోస‌మేనా దీపిక ఇంత ఆరాటం?

By:  Tupaki Desk   |   27 Feb 2022 3:30 AM GMT
గ్రీక్ గాడ్ కోస‌మేనా దీపిక ఇంత ఆరాటం?
X
గ్రీక్ గాడ్ గా యువ‌త‌రం హృద‌యాల్లో స్థిర‌మైన ముద్ర వేసుకుని ఉన్నాడు హృతిక్ రోష‌న్. అత‌డి డ్యాన్సుల‌కు న‌ట‌న‌కు ఫిదా అవ్వ‌ని వారు ఉండ‌రు. బాలీవుడ్ లోనే మోస్ట్ ట్యాలెంటెడ్ హీరోగా హృతిక్ కి ఉన్న రికార్డు చాలా అరుదైన‌ది. ఇక అతడి స‌ర‌స‌న న‌టించే అవ‌కాశం వ‌స్తే ఏ బ్యూటీ అయినా వ‌దులుకుంటుందా?

ఇప్పుడు అలాంటి అరుదైన అవ‌కాశం త‌న‌కు ద‌క్కినందుకు దీపిక ప‌దుకొనే ఎంతో ఎగ్జ‌యిట్ మెంట్ ని క‌న‌బ‌రుస్తోంది. త‌న కెరీర్ లో ఎన్ని సినిమాలు ఉన్నా కానీ.. హృతిక్ తో మాత్రం చాలా స్పెష‌ల్ అని అత‌డికి వీరాభిమానిని అని ఇంత‌కుముందు దీపిక చెప్ప‌క‌నే చెప్పింది. తాజా స‌మాచారం మేర‌కు హృతిక్-దీపిక జంట‌గా న‌టించే భారీ చిత్రం తొంద‌ర్లోనే ప్రారంభమవుతుందని తెలిసింది.

సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహించనున్న ఈ భారీ యాక్షన్ డ్రామాలో మెగాస్టార్ .. హృతిక్ రోషన్ - దీపికా పదుకొణె తొలిసారిగా కలిసి న‌టించనున్నారు. ఇది అరుదైన క‌ల‌యిక‌. ఈ సినిమా ఏడాది క్రితమే ప్రారంభం కావాల్సి ఉండగా కోవిడ్ కారణంగా వాయిదా పడింది. ఇప్పుడు షూటింగ్ జూన్ నెల నుండి ప్రారంభం కానుందని సమాచారం.
ఇందులో వెట‌ర‌న్ న‌టుడు అనిల్ కపూర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది రిపబ్లిక్ డే కానుకగా విడుదల కానుంది. ప్రస్తుతానికి దీపిక ప్రభాస్ తో నాగ్ అశ్విన్ సైన్స్ ఫిక్ష‌న్ చిత్రంతో బిజీగా ఉంది. హృతిక్ `విక్రమ్ వేద` రీమేక్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు.