Begin typing your search above and press return to search.

ఇక‌పై థియేట‌ర్లు క‌ళ్యాణ మంట‌పాలు అవుతాయా?

By:  Tupaki Desk   |   27 Aug 2020 1:40 PM IST
ఇక‌పై థియేట‌ర్లు క‌ళ్యాణ మంట‌పాలు అవుతాయా?
X
అస‌లు ఈ క‌రోనా క్రైసిస్ లేని రోజుల్లోనే థియేట‌ర్ల నిర్వ‌హ‌ణ పెనుభారంగా మారింద‌ని వీటితో ఎలాంటి ఆదాయం లేద‌ని చాలామంది ఎగ్జిబిట‌ర్లు వాపోయేవారు. ఎప్ప‌టిక‌ప్పుడు ఫిలింఛాంబ‌ర్ లో మీటింగులు పెట్టి త‌మ‌కు వాటిల్లుతున్న న‌ష్టాల‌పై ఏక‌రువు పెట్టేవారు. ఇక పార్కింగ్ ఫీజు దోపిడీ .. క్యాంటీన్ దోపిడీ అంటూ ప్ర‌భుత్వాలు పెట్టే నియ‌మ నిబంధ‌న‌ల‌కు పూర్తిగా ఈ రంగం కుదేలైపోయింద‌న్న నివేద‌న కూడా ఉంది. అటు ఏపీ.. ఇటు తెలంగాణ‌లో దీనిపై నిరంత‌రం థియేట‌ర్ యాజ‌మాన్యాలు ఫైట్ చేస్తున్నాయి.

ఇప్పుడు ఏకంగా క‌రోనా మ‌హ‌మ్మారీ రాక‌తో ఐదారు నెల‌లుగా థియేట‌ర్లు మూత‌ప‌డిపోయాయి. ఇప్ప‌ట్లో తెరిచే సూచ‌న‌లు అయితే క‌నిపించ‌డం లేదు. మునుముందు తెరిచినా జ‌నం వ‌స్తారా అంటే చెప్ప‌లేని ప‌ర‌స్థితి. కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు అన్ లాక్4.0 మార్గ‌ద‌ర్శ‌కాల‌తో థియేట‌ర్లు తెరుచుకోవ‌చ్చ‌ని ప్ర‌క‌టించినా కానీ జ‌నాల్లో బెంగ భ‌యం మాత్రం పోలేదు. వ్యాక్సిన్ రాదు.. టీకా జాడ లేదు. కాబ‌ట్టి ఇప్ప‌ట్లో థియేట‌ర్లు తెరిచినా క‌ష్ట‌మేన‌నేది ఇప్ప‌టికే ఎగ్జిబిట‌ర్లు విశ్లేషించారు.

అయితే ఈ ప‌రిస్థితి వ‌ల్ల మాల్స్ .. మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్ల‌కు కొంత‌వ‌ర‌కూ సేవ్ అయ్యేందుకు ఛాన్సున్నా కానీ.. సింగిల్ స్క్రీన్లకు మాత్రం స‌మ‌స్యేన‌ని విశ్లేషిస్తున్నారు. సింగిల్ స్క్రీన్లు మామూలు రోజుల్లోనే మెయింటెనెన్స్ అయినా క‌ష్ట‌మైపోయేవి చాలా ఉన్నాయి. అలాంటివ‌న్నీ ఇప్పుడు మూత ప‌డిపోవ‌డం ఖాయంగానే క‌నిపిస్తోంద‌ట‌. అన్ లాక్ రూల్స్ వెసులుబాటుతో ప‌నేం లేదు. వీటిని తెరిచి స‌గం సీట్లు భ‌ర్తీ చేసి నిబంధ‌న‌లు పాటించినా ఎలాంటి ఉప‌యోగం ఉండ‌ద‌ని చెబుతున్నారు. అందుకే ఇవ‌న్నీ క‌ళ్యాణ‌మంట‌పాలు.. గొడౌన్లుగా మారిపోయినా ఆశ్చ‌ర్య‌పోన‌క్క‌ర్లేద‌ని విశ్లేషిస్తున్నారు. తాజా అన్ లాక్ రూల్స్ ప్ర‌కారం థియేట‌ర్ యాజ‌మాన్యాల‌కు ఖ‌ర్చు త‌డిసిమోపెడ‌య్యే ప‌రిస్థితి ఉంది. శానిటైజ‌ర్లు.. థ‌ర్మ‌ల్ స్కానింగ్ అంటూ అంతా ఖ‌ర్చే మిగులుతుంది.

నిజానికి తెలుగు రాష్ట్రాల్లో 1700 వ‌ర‌కూ ఉండే థియేట‌ర్లు ఇప్ప‌టికే 1200 కు కుదించుకుపోయాయ‌ని.. ఇవి కూడా ఇక మిగ‌ల‌వ‌ని విశ్లేషిస్తున్నారు. కేవ‌లం మ‌ల్టీప్లెక్స్ థియేట‌ర్లు కొంత‌వ‌ర‌కూ ఇత‌ర ఆదాయ మార్గాల‌తో బ‌తికిపోయినా కానీ.. సింగిల్ స్క్రీన్ల మనుగ‌డ మాత్రం చాలా క‌ష్ఠ సాధ్య‌మ‌ని విశ్లేషిస్తున్నారు. డ‌బ్బులిచ్చి క‌రోనాను కొని తెచ్చుకోలేరు క‌దా! అని సినీపెద్ద‌లే విశ్లేషిస్తున్నారు. ఈ రంగంలో ఉన్న‌వాళ్లు దానిని ఖండించ‌డం లేదు. ఎగ్జిబిష‌న్ రంగంలో సుదీర్ఘ అనుభ‌వం ఉన్న డి.సురేష్ బాబు అయితే మ‌ల్టీప్లెక్సుల్ని తెర‌వాల‌న్నా ఆలోచించాల్సిందేన‌ని ఇంత‌కుముందు విశ్లేషించారు. 30-50 ప‌ర్సంట్ ఆక్యుపెన్సీతో ప‌ప్పులుడ‌క‌వు అనేది ఆయ‌న వాద‌న‌. అటు అమెరికా లాంటి చోట ఏఎంసీ థియేట‌ర్లు మూత‌ప‌డ్డాయి. వాటిని అమెజాన్ లాంటి పెద్ద సంస్థ‌లు కొనుక్కుంటున్నాయ‌న్న ప్ర‌చారం ఇటీవ‌ల సాగింది.