Begin typing your search above and press return to search.

అల్లరి నరేష్ ట్రాక్ లోకి వస్తాడా?

By:  Tupaki Desk   |   7 May 2019 2:32 PM IST
అల్లరి నరేష్ ట్రాక్ లోకి వస్తాడా?
X
టాలీవుడ్ లో చాలామంది హీరోల కంటే విజయాలు ఎక్కువ ఉన్న హీరో అల్లరి నరేష్. ఒక దశలో అల్లరి నరేష్ మినిమమ్ గ్యారెంటీ హీరోగా పేరుతెచ్చుకున్నాడు. అయితే గత కొన్నేళ్లుగా మాత్రం తన కెరీర్లో వరస ఫ్లాపులతో సతమతమవుతున్నాడు. సరిగ్గా ఈ సమయంలోనే మహేష్ బాబు 'మహర్షి' చిత్రంలో కీలక పాత్రకు దర్శకుడు వంశీ పైడిపల్లి పట్టుబట్టిమరీ ఒప్పించాడు. మహేష్ లాంటి స్టార్ హీరో సినిమాలో ఫోకస్ అంతా మహేష్ పైనే ఉంటుంది. మరి ఈ సినిమా అల్లరి నరేష్ కు ప్లస్ అవుతుందా.. మైనస్ అవుతుందా?

హీరోగా దాదాపుగా ఫేడ్ అవుట్ అయ్యే దశలో ఉన్నాడు కాబట్టి ఈ సినిమాతో ఒక్కసారి మళ్ళీ నరేష్ లైమ్ లైట్ లోకి వచ్చే అవకాశం అయితే ఉంది. సినిమాలో నరేష్ ది చాలా కీలకామిన పాత్ర అని.. కథాగమనాన్ని మలుపుతిప్పే పాత్ర అని ఇప్పటికే టాక్ ఉంది. కాబట్టి నరేష్ తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేయడం ఖాయమే. నరేష్ కామెడి మూసలో చిక్కుకున్నాడు కానీ స్వతహగా మంచి నటుడు. 'గమ్యం'.. 'శంభో శివ శంభో' లాంటి సినిమాలు చూసిన వారు ఎవరైనా ఆ విషయాన్ని ఒప్పుకుంటారు. ఈసారి కూడా అలాంటి స్టైల్లోనే ప్రేక్షకుల హృదయాన్ని టచ్ చేసే పాత్ర అని అంటున్నారు కాబట్టి అల్లరి నరేష్ కు మంచి పేరు తీసుకువస్తుందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ఈ సినిమాతో నరేష్ కు మళ్ళీ క్రేజ్ పెరుగుందనే అంటున్నారు. ఈ సినిమా తర్వాత నరేష్ కు స్టార్ హీరోల సినిమాలలో ప్రత్యేక పాత్రల ఆఫర్లు మాత్రం ఎక్కువయ్యే అవకాశం ఉంది. కానీ అది సోలో హీరోగా నరేష్ చేయబోయే సినిమాలకు ఎంతవరకూ ఉపయోగపడుతుందనేది ఇప్పుడే చెప్పలేం. ఒవరాల్ గా చూస్తే మాత్రం నరేష్ కెరీర్ కు 'మహర్షి' బూస్ట్ తీసుకురావడం మాత్రం పక్కా.