Begin typing your search above and press return to search.

ఆర్యన్ ఖాన్ ఎలా దొరికాడు? పోలీసులు ఏం చేశారు..?

By:  Tupaki Desk   |   4 Oct 2021 6:33 AM GMT
ఆర్యన్ ఖాన్ ఎలా దొరికాడు? పోలీసులు ఏం చేశారు..?
X
డ్రగ్స్ వ్యవహారం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కొందరు ప్రముఖులు, సినీ ఇండస్ట్రీకి చెందిన వారిని ఓ వైపు డ్రగ్స్ కేసులో విచారిస్తుండగానే.. మరోవైపు డ్రగ్స్ సరఫరా జరుగుతోంది. ఇంకో వైపు డ్రగ్స్ పార్టీ చేసుకుంటూ కొందరు జల్సా చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ బాద్ షా గా పేరు తెచ్చుకున్న షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ పార్టీ చేసుకుంటుండగా ఎన్సీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అయితే వారు పట్టుకున్న తీరుచూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ముంబై నుంచి గోవాకు ఓ క్రూయిజ్ షిప్ వెళ్తోంది. ఇందులో రేవ్ పార్టీ జరుగుతుందని డ్రగ్స్ కంట్రోల్ స్క్వాడ్ కు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాస్తవానికి ఈ షిప్ సోమవారం ముంబయికి తిరిగి రావాల్సి ఉంది. కానీ గోవాలో ఎన్సీబీ అధికారుల మఫ్టీలో పర్యాటలకులుగా షిప్ లోకి ఎక్కారు. ఆ తరువాత డ్రగ్స్ పార్టీ చేసుకుంటున్న 8 మందిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. షిప్ ప్రయాణం ప్రారంభించగానే వీరిని పట్టుకున్నట్లు ఎన్ సీబీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే మీడియాకు తెలిపారు.

ఇందులో షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ తో పాటు అర్భాజ్ మర్చంట్, మూన్ మూన్ ధమేచా, నూపూర్ సారిక, ఇస్మిత్ సింగ్, మోహక్ జైస్వాల్, విక్రాంత్ చోకర్, గోమిత్ చోప్రాలు ఉన్నట్లు ఎన్ సీబీ అధికారులు తెలిపారు. మొత్తంగా 8 మందిని అదుపులోకి తీసుకోగా ఇందులో ఇద్దరు అమ్మాయిలు ఉన్నట్లు వారు తెలిపారు. తమకు అందిన పక్కా సమాచారంతోనే ఈ దాడి చేశామన్నారు. అయితే ఈ కేసులో ఎంతటి వారినైనా విడిచిపెట్టేది లేదని, సమగ్రంగా విచారిస్తామని తెలిపారు. అంతేకాకుండా ఈ పార్టీ నిర్వహణలో ఎవరెవరి హస్తం ఉందో విచారణ చేపడుతామన్నారు.

‘డ్రగ్ష్ కేసును నిష్పాక్షిపాతంగా విచారిస్తాం. ముంబయ్ క్రూయిజ్ పార్టీలో అదుపులోకి తీసుకున్న వారి వెనుక ఎవరున్నారన్నకూపీ లాగుతాం. ఈ కార్యక్రమం వెనుక బాలీవుడ్ ప్రముఖులు, ధనవంతుల కనెక్షలు ఉన్నా లెక్కచేయకుండా విచారణ జరుపుతాం. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా విచారణ పూర్తి చేస్తాం.’ అని ఎన్ సీబీ చీఫ్ ప్రదాన్ మీడియాకు తెలిపారు.

ఇలాంటి క్రూయిజ్ పార్టీ కల్చర్ కొద్ది రోజుల కిందేట ప్రారంభించారు. బయట పార్టీ చేసుకుంటే సమాచారం అందుతుందన కొందరు ఇలా రేవ్ పార్టీని షిప్ లో అరేంజ్ చేస్తున్నారు. అరేంజ్ మెంట్ కొత్తగా ఉండడంతో చాలా మంది దీనికి ఆకర్షితులవుతున్నారు. దీంతో ఈ పార్టీలో జాయిన్ అవుతున్నారు. ఇందులో ఎంట్రీ ఇవ్వాలంటే రూ. 80 వేలు చెల్లించాలి. ఇక ఆర్యన్ ఖాన్ వద్ద నుంచి డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆయన వద్ద నుంచి 13 గ్రాముల కొకైన్, 5 గ్రాముల ఎండీ, 21 గ్రాముల చరస్, 22 ఎండీఎంఏ టాబ్లెట్లు స్వాధీనం చేసుకున్నామని ఎన్ సీబీ అధికారులు తెలిపారు.

ఇదిలా ఉండగా డ్రగ్స్ వ్యవహారం దేశాన్ని కుదిపేస్తోంది. అయితే స్టార్లు , పార్టీల్లో చిన్న మొత్తంలో డ్రగ్స్ దొరకడంతో హల్ చల్ చేస్తున్న అధికారులు.. గుజరాత్ లో పెద్ద మొత్తంలో డ్రగ్స్ పై ఎలాంటి విచారణ చేయారా..? అని కొందరు ప్రశ్నిస్తున్నారు. గుజరాత్ లో ఇటీవల 15 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. మరి అంత పెద్ద మొత్తంలో ఎలాంటి విచారణ చేయకుండా దృష్టి మరల్చడానికి ఇలాంటి పార్టీలపై దాడులు చేస్తున్నారని అంటున్నారు. ఇక కొన్ని నెలలుగా సినీ స్టార్లను డ్రగ్స్ వ్యవహారంలో పోలీసులు విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే.