Begin typing your search above and press return to search.

ఆర్జీవీ ఫార్ములాతో ఈజీ మ‌నీ మేకింగ్ నిజ‌మా?

By:  Tupaki Desk   |   15 July 2020 12:20 PM IST
ఆర్జీవీ ఫార్ములాతో ఈజీ మ‌నీ మేకింగ్ నిజ‌మా?
X
OTT లేక‌పోతే ATT .. ఏదో ఒక‌టి స్టార్ట్ చేసి సులువుగా సంపాదించేయ‌డ‌మెలా? డిజిట‌ల్ వ‌ర్క‌వుట‌వుతున్న ఈ టైమ్ లో సినీప‌రిశ్ర‌మ‌లో ప్ర‌వేశించి డ‌బ్బును సంచుల్లో బ‌స్తాల్లో స‌ర్దేయ‌డ‌మెలా? ఇలా ఆలోచించేవాళ్లే ఎక్కువ‌. అయితే అందులో వాస్త‌వాలేమిటి? సాధ్యాసాధ్యాలేమిటి? అన్న‌ది అనుభ‌వ పూర్వ‌కంగా తెలిసింది ఎంద‌రికి? అంటే వేళ్ల పైనే లెక్కించ‌వ‌చ్చు. ఆ అనుభ‌వం అయ్యింది మాత్రం చాలా కొద్ది మందికే.

ఈ రంగంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కోవాలి. డ‌క్కా మొక్కీలు తిన్న గ‌జ‌క‌ర్ణ‌గోక‌ర్ణ విద్య‌లు ప్ర‌ద‌ర్శించే అనుభ‌వ‌జ్ఞులే చేతులెత్తేసిన సంద‌ర్భాలెన్నో ఇక్క‌డ‌. పెట్టుబ‌డుల్ని తిరిగి రాబ‌ట్టుకోవ‌డం అన్నది అన్ని క‌ళ‌ల్ని మించిన గొప్ప క‌ళ‌. కానీ ఇందులో స‌క్సెస‌య్యేది చాలా చాలా కొద్దిమంది మాత్ర‌మే. అందులో వివాదాల డైరెక్ట‌ర్ ఆర్జీవీ ఉన్నారా? అంటే ..ఏమో.. చెప్ప‌లేం!

ఇండ‌స్ట్రీలో అన్నీ చ‌దివేసిన అనుభ‌వ‌జ్ఞుడు ఆర్జీవీ అంటూ కొంద‌రు ప‌రిశ్ర‌మ అభిమానులే తెగ పొగిడేస్తుంటారు. అయితే ఆర్జీవీ థియేట‌ర్ ఏటీటీలో స‌క్సెస‌య్యారా? అంటే ఇంకా చెప్ప‌లేం. ఇప్ప‌టివ‌ర‌కు రిలీజ్ చేసిన రెండు సినిమాలు క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ లు అయ్యాయ‌ని ప్ర‌చారం చేస్తున్నారు కానీ.. ఆ రెండిటి ట్రేడ్ పై స‌రైన వివ‌రాలు బ‌య‌ట‌కు చెప్ప‌డం లేదు. శ్రేయాస్ ఇటి యాప్ లో కూడా అలాంటి ప‌ద్ధ‌తి లేదు. అయితే ఇప్ప‌డు ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాజకీయ నేప‌థ్యంతో `ప‌వ‌ర్ స్టార్` అనే సినిమాను రెడీ చేస్తున్న ఆర్జీవీకి కాసులు పంట మొద‌లైన‌ట్లే అని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఆల్రేడీ బుకింగ్స్ స్టార్ట్ చేసిన ఆర్జీవీకి దాదాపు 10 కోట్ల రూపాయ‌లు లాభం వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. అయితే ఇందులో నిజం ఎంత‌? శాస్త్రీయ‌త ఎంత‌? అన్న‌దానికి మాత్రం అట్నుంచి ఎవ‌రి ద‌గ్గ‌రా ఆన్స‌ర్ లేదు. ఆర్జీవీనే ఆ లెక్క‌లేవో బ‌హిర్గ‌తం చేస్తే బావుంటుందేమో!